పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38 సాహిత్య మీమాంస

ములయందు కరుణేత్యాది *[1] స్థాయీభావ విభావములచేత పరిపుష్టినొందిన లోకోత్తరానంద జనకము రసము. కావ్యమునకు రస మాత్మవంటిది. కావ్యమును పఠించునప్పుడున్నూ దాని ప్రదర్శము జూచునప్పుడున్నూ కోవిదుల మానసము లందు ఆనందోదయ మగునటుల కవి కావ్యమును రచింప వలయును. ఇది కావ్యమునకు ప్రధానగుణము. ఇది గాక యింకేదైనా ఫల ముండిన నుండ వచ్చుబు.

"శరీరం తావ దిష్టార్థ వ్యవచ్ఛిన్నా పదావళీ" అనగా

  1. * విభావానుభావసంచారీభావములచే స్థాయీభావము వ్యక్తము కాగా రసోత్పత్తి యగును. భావనను విశిష్టముగా స్పష్టీకరించునది "విభావము", ఇది రెండువిధములు : - ఆలంబనము, ఉద్దీపనము. దేని ఆశ్రయమున రస ముదయించునో అది "ఆలంబనము". దేనివల్ల రసము అతిశయించునో అది "ఉద్దీపనము" రసానుభూతిని కావించుభావము "అనుభావము" సాత్విక, కాయిక, మానసికములని అనుభావము మూడురకములు. రసమున సంచరించుభావము "సంచారి" యగును, స్థిర మగుభావము "స్థాయి" అనబడును. వచ్చుచూ పోవుచుండునని సంచారిభావములు; ఎప్పటికిని స్థిరముగా నుండునది స్థాయీభావము. రతి (అనురాగము) హాసము, శోకము, క్రోధము, ఉత్సాహము, భయము, గ్లాని, ఆశ్చర్యము, నిర్వేదము లని తొమ్మిది స్థాయీభావములు - వీటినుండి శృంగారము, హాస్యము మొదలగు తొమ్మిదిరసములూ క్రమముగా పుట్టును. రసములన్నిటికీ ఉత్పత్తి విభావానుభావసంచారీస్థాయీభావము లుండితీరును. వీటినిగూర్చి విపులముగా నెఱుగ దలచువారు దశరూపకాది ఆలంకారిక గ్రంథముల చూడనగును.