పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf

రెండో ప్రకరణము

_______

సాహిత్యమున రక్తపాతము

రక్తపాతమును గురించి అలంకారికుల మతము -

ఆర్యాలంకారికులు కావ్యములను దృశ్యము లనియు శ్రవ్యము లనియు రెండు తరగతులుగా విభజించిరి. ఒకరు పఠించగా వినుటకును స్వయముగా అధ్యయనము చేయుటకును రచింపబడిన కావ్యములు శ్రవ్యములు. కావ్యకల్పన మభినయ రూపమున వ్యవహారమున పరిణమింపజేసి పదిమందియెదుట ప్రదర్శింపవలసినవి దృశ్యములు; కావ్యమునకు రూప మారోపించుటచే వీటికి రూపకములని పేరు పెట్టినారు. సాహిత్యదర్పణకారుడు "వాక్యం రసాత్మకం కావ్యమ్" "రసవంతమైన వాక్యము కావ్యము" అని లక్షణము నిరూపించెను. మానసమున ప్రేమకాని ఆనందము కాని జనింపనేరనిది రసము కాదు. సహృదయుల హృదయ