పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35 ఆదర్శము

మందోదరి తన పతిని శ్రీరామునితో సంధిచేసుకొమ్మని పలుమారు నిరోధించుటకు హేతు వేమి? శ్రీరాముడు లోకైక వీరుడు గాన అతని బలమునకూ చలమునకూ వెఱచియా? కాదు కాదు. ఆతని యం దొక విలక్షణమైన శక్తి అనగా దైవబల మున్నదని ఆమహాసాధ్వి గుర్తించింది. అతనియందట్టి తేజు గాంచి తత్ప్రభావమును సాక్షాత్కరించుకొన్నది కావున ఆమె "నాధా! శ్రీరాముడు జననమరణ రహితుడు; సర్వశక్తుడు; సర్వాంతర్యామి; ప్రకృతిప్రవర్తకుడు; సనాతనుడు; పరమపురుషుడును కానోవు. శ్రీవత్సాంకుడు; అక్షరుడు; పరిణామ శూన్యుడు; సత్యపరాక్రముడు, అజయుడు; సర్వలోకేశ్వరుడు; లక్ష్మీపతియు నగు విష్ణువు సమస్తజగత్కళ్యాణ సంధాయి కావున తాను మానవరూపముదాల్చి దేవతల నందరిని వానరుల గమ్మని, భూభారనిర్వహణార్థము మహాబలసంపన్నులు అమిత పరాక్రములు, లోకవిద్రావణులు, త్రిలోక భీకరప్రవృత్తులు నగుమిమ్ము సమూలము సమయింప జేయుటకు వచ్చియున్నాడని నాకు *[1] పొడగట్టు చున్నద"ని మొఱపెట్టెను.

శ్రీరాముని చరితము పార్థివదైవబలస్ఫూర్తియుతమగు అద్వితీయవీరత్వ సంపదచే విలసిల్లుచున్నది. ఆత డపరసృష్టి యని చెప్పియుంటిమికదా వియోగాంత నాటకము

  1. * శ్రీమద్రామాయణము యుద్ధకాండము 113 అధ్యాయము చూడండి. అతని యం దన్ని రకముల వీరత్వమూ అన్నివిధముల బలమూ పుంజీ భూతమై యున్నది. ఇతర వీరులయందివి కొన్ని మాత్రమే ఉండును.