పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30 సాహిత్య మీమాంస

ములు; అందు శౌర్యవీరుల చిత్రములు కరవుతీర కలవు. ధర్మవీరుల ప్రతిమ లెందునూ కానరావు. శ్రీరామ ధర్మ నందనులు మానవ కల్పనాసీమనెల్ల కప్పియున్నారు. ఇం కేది చేర్చుటకూ సూదిముల్లు మోపు చోటైనా లేదు. వారిచరిత మందలి అనల్పకల్పన మానవ హృదయములందు భక్తి శ్రద్ధల పుట్టించి వాటిని శాంతరస ముద్రితముల జేయును.

డెన్‌డెమోనాపాత్ర మనల్పకృపాపాత్రము: లియర్ తన అవివేకముచే తెచ్చి పెట్టుకొన్న కష్టములు పాషాణ హృదయము నైనా కరిగింపగలవు. పతివియోగమున ఉత్తరవలె సుతవియోగమున కాన్‌స్టెన్స్ మనో వైకల్యము చెంది ఊరడిల్లుటకు ఉపాయాంతరము లేనందున పిచ్చియెత్తి తానేడ్చి యితరుల నేడ్పించినది. అంతతో ఆమెపని సరి. వియోగాంత నాటకనీరంధ్రనిబిడాంధకారమున డెన్‌డెమొనా చిన్న నక్షత్రమువలె మినుకులాడుచున్నది. చండభానుడు కేతుగ్రస్తుడై నప్పుడు దివసమంధకారమయమై మట్టమధ్యాహ్నమున చీకటి గ్రమ్మును. అప్పుడు కొన్ని నక్షత్రములు గగనమున పొడచూపును; డెన్‌డేమొనా అట్టిచుక్క. నాటకబీభత్సాంధకార మామె స్వచ్ఛజ్యోతి నాచ్ఛాధించినా, దయకించుక తావుంచినది. వియోగాంతనాటకములం దిదే వరుస - ధర్మజ్యోతి ఆ నాటకముల పాపాంధకారమున బడి వెలుగుదామని ఎంత యత్నించినా, సముద్రమున బడు వర్షధారలవలె స్వీయనిర్మల రుచిని నిల్పుకొనజాలదు. ఆనాటకములందు ధర్మాభాస