పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27 ఆదర్శము

రింపలేదు. అట్టి లోకోత్తరమగు గురుకులమును పూజించి తత్ప్రతిష్ఠ లోకమున వ్యాపింపజేయుట న్యాయము కాని, దాని కవమానము సంధింజేయుట మీవంటివారి కర్హముకాదు. గౌతమపుత్రి సాథ్వియునైన మీ గురుపత్నికి పుత్త్రశోకము తెచ్చిపెట్టినానన్నరట్టు నాకేల? దాన నాపరితాప మారునా? మనతోగూడ ఆమె పుత్రశోకానలమున మడియ నేల? ఇప్పటికే బంధువియోగానలమున సంతప్తమగుచున్న మనకులము గురుకులతిరస్కారశోక దవానలమున దహింపబడ నేల? ఇతడు చిరజీవియై యుండి ఈతని తల్లి నావలె కడుపుదు:ఖమున కమలకుండుగాక" అని పల్కి అశ్వత్థామను విడిచిపుచ్చెను. <>

      1. భూసురుఁడవు, బుద్థిదయా| భాసురుఁడవు; శుద్ధవీరభటసందోహా
         గ్రేసరుఁడవు, శిశుమారణ| మాసురకృత్యంబు ధర్మమగునే తండ్రీ?
     2. ఉద్రేకంబునరారుశస్త్రధరులై| యుద్ధావనిన్ లేరు, కిం
         చిద్రోహంబును నీకుఁజేయరు బలో| త్సేకంబుతో చీఁకటిన్
         భద్రాకారుల, చిన్న పాపల, రణ| ప్రౌఢక్రియాహీనులన్,
         నిద్రాసక్తుల సంహరింప నకటా ! నీచేతులెట్లాడెనో?.......
     3. ద్రోణునితో శిఖింబడక| ద్రోణకుటుంబిని యున్న దింట, స
         క్షీణతనూజ శోకవివ| శీకృతనై విలపించుభంగి, నీ
         ద్రౌణి దెరల్చి తెచ్చుటకు| దైన్యము నొందుచు నెంతపొక్కునో,
         ప్రాణవియుక్తుడైన నతి| పాపము బ్రాహ్మణహింస మానరే.

</> పుత్రశోకోద్వేగావిలమానస యగు ఆమానినీమణి ధర్మానురక్తి ఎవరిమనము నక్కజపరుపదు? ఇట్టి అలౌకిక సహృదయత, క్షమ, ధర్మప్రీతిగుంఫితచిత్రము అశ్వత్థామ నింద్యచిత్రమును మరుగుపరచి, ఉదారమూ శాంతము నగు