పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26 సాహిత్య మీమాంస

విని ఆపాదమస్తకము అడలనివారూ ఆశూరమ్మన్యు నేవగింపనివారూ ఉందురా! దుర్యోధనుడుమాత్రము సంతసించెనా? పాండవులు చావరైరికదా అని పల్లటిల్లి ప్రాణములు విడిచెను. కౌరవవీరుల ఈభయానకబీభత్సపై శాచిక ప్రవృత్తిని గాంచి రోతపడనివా డెవడు? దీని యనంతరసృష్టిని తిలకింపుడు - పుత్త్రశోకోపహతచిత్తయై ద్రౌపది కన్నీరు మున్నీరుగా నేడ్చుచుండ ఆదు:ఖ మపనయించి ఆమెకు సంతసము చేకూర్ప "దేవీ, నీపుత్రఘాతకుని శిరము ఖండించినీ కుపాయనముగా కొనివచ్చెదను; ఇదే యీఘోరపాతకమునకు తగిన ప్రతీకారము" అని అర్జునుడు ప్రతిన జేసి శ్రీకృష్ణ సహాయుడై అశ్వత్థామను కట్టితెచ్చి ద్రౌపది మ్రోల బడవైచెను. పుత్రశోకాతురయగు ఆసాధ్వీమణి నీసందర్భమున శ్రీమద్భాగవతమున వ్యాసభట్టారకు డిట్లు వర్ణించెను : - పశువువలె త్రాటం గట్టబడి తానొనర్చిన ఉత్కటపాపమునకు ఫల మిహముననే లభించెగదా అని బాలవధజనిత పరమలజ్జాప రాఙ్ముఖు డైన అశ్వత్థామకునమస్కరించి పరమసాధ్వినిట్లనియె. "నాథా? ఈబ్రాహ్మణకుమారుడు గురుతుల్యుడు మీరు సాంగధనుర్వేదమూ నిస్తులాస్త్రవిద్యాగూఢమర్మములునూ ఈమహాత్ముని జనకు లగు ద్రోణాచార్యులయొద్ద నభ్యసించి జగదేక శూరులైతిరికాదె? భగవత్స్వరూపు డగు ఆమహాత్ముని కేకపుత్రు డీతడు - పతివ్రతాతిలక మగు నీతని జనని వీరమాతకృపి యీతని కొరకుకాదె సహగమన మాచ