పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25 ఆదర్శము

పాండవులు మాతృభక్త్యవతారము లనవచ్చును. అలౌకికపతిభక్తి:కుదహరణములనేకములుకలవు. సతి, పార్వతి, గాంధారి, ద్రౌపది, సీత, సావిత్రి, కౌసల్య, దమయంతి, అరుంధతియు ఆర్యసాహిత్యమున ఆదర్శపతివ్రతలు. వారి అలౌకికప్రేమ పతిభక్తిగా పరిణమించింది. కర్ణుడు, బలి, హరిశ్చంద్రుడును దానవీరులు; శ్రీరాము డలౌకికసత్యపాలకుడు; లక్ష్మణు డసామాన్య బ్రహ్మచారి,

ఇట్టి పవిత్ర ధర్మాదర్శము లొకచాయ ఆసురప్రతిమ లింకొక చాయ ఆర్యసాహిత్యము నలంకరించుచున్నవి; రెండూ అలౌకికములే. పాపదమన మొకవంక పుణ్యోదయ మొకవంక పరిఢవిల్లుచుండ, ద్వివిధసంపదచే ఆసాహిత్యము పాపనివృత్తి నొనర్చుటేకాక పుణ్యపథప్రవృత్తి నాపాదిస్తూన్నది. ఇంతకన్న ఉన్నతాదర్శములు భావనాతీతములు.

ఇందలి యా థార్థ్యమునకు చిన్నదృష్టాంతము నవలోకింతాము - భీమసేనుని గదాప్రహారమున దుర్యోధను మారుభంగ మాయెను. దృప్తారుల బాకు దెబ్బలచేత శరీరము రక్తసిక్తమై రారాజు అడవి మొఱలిడుచుండ అశ్వత్థామ చేరవచ్చి, అనునయించి, ప్రభువునకు సంతసము గూర్ప పృథ్వి నపాండవ మొనర్తునని నమ్మించి, ప్రతిన జేసి సేనాధిపతి అయ్యెను. పిమ్మట నిశీథమున పాండవ శిబిరము జొచ్చి ఆత్రమున పాండవు లను భ్రాంతిచే ఉపపాండవులైదుగురి గొంతుకలు కోసెను. అట్టి అసురకార్యనిర్వహణము