పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18 సాహిత్య మీమాంస

అంతర్వైరోన్మాదము, పాపపరాక్రమమునూ మూర్తివంతములగునట్లు రచించుట మహాకవులకు చక్కని రాజమార్గ మగునేని దీనికి తోడుగ జితేంద్రియత్వము, ధర్మ వీర్యమును మూర్తీభవింపజేసిన వారిప్రకర్ష వాడిపోవునా? మానవప్రకృతి కొకప్రక్క సముజ్వలరీతిని చిత్రించుట ఉచితమైతే, రెండవప్రక్కగూడా చిత్రించుట అనుచితమగునా? అదీకాక ప్రపంచమును ప్రతిబింబించుపట్ల అసురప్రవృత్తి మాత్రమే వ్యక్తీకరించిన లాభమేమి? దానికితోడు పరమేశ్వరుని *[1] అష్టవిభూతుల నమర్చి శోభావంతమగు ఆతని సౌమ్యమూర్తిని కూడా చిత్రించుట యుక్తము - అప్పుడు సమగ్రబ్రహ్మాండమున్నూ జాజ్వల్య మానశోభాయుతము భీషణమునగు మూర్తిద్వయము దాల్చును. ఆర్యసాహిత్యమున నిట్టి సంపూర్ణమూర్తి చిత్రింపబడినది. ప్రకృతికి ప్రక్కనే పురుషుడుండును కావున మూర్తిద్వయము సమానోజ్వల భావమున రాజిల్లుచుండును. శరీరమం దంగ ప్రత్యంగములు తత్తత్సమాన పరిమాణములతో వికాసమానములగుట చూస్తున్నాము. శిరస్సులేని మొండెమును కానీ అంగప్రత్యంగములులేని శిరస్సునుగానీ చిత్రిస్తే ఆప్రతిమ సంపూర్ణ మగునా?

షేక్స్‌పియరున్నూ అసురనాశకధర్మవీరుల చిత్రము

  1. * అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ వశిత్వములు అష్టవిభూతులు.