పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17 ఆదర్శము

యోన్;...కాని తత్త్యుల్యమానసిక సౌందర్యాదర్శమును సృజించుటలో నాతడార్యకవివరులకు వెనుకబడెను - అతని మిరాండా శకుంతలకు తీసిపోయినది; రోసలిండ్, హెర్మియోన్, ఇసబెలా, హెలీనాలు అసామాన్య సౌందర్యమూర్తులు కాజాలరు. వియోగాంత నాటకములయం దాతడు తిలోత్తమవంటిదాని చేయబూని మేక్‌బెత్ రాణి వంటి అసురసృష్టి నొనరించెను. రోమియో, ఇయాగో, మేక్‌బెత్ రాణి, మూడవరిచర్డ్ వంటివారు లేకుంటే భయంకరచిత్రసమన్వితములూ రక్తపాతపరిణతములూ అగు నాటకము లెట్లు వెలువడ గలవు?

ఆర్యసాహిత్యమునా ఇట్టి భయావహమగు సృష్టి లేక పోలేదు, కాని అట్టివారి కసురులనియే పేరు; వారి వ్యక్తులు మానవేతరములు, ధర్మద్వేషమందును దేవద్రోహమందును వారు సుప్రసిద్ధులు. మిల్టన్ కావ్యమందిట్టి ప్రచండ రాక్షస సృష్టి సైతా నొక్కడే కలడు, కాని ఆర్యసాహిత్యము నందట్టివారు లెక్కలేనంతమందికలరు. వృత్రాసురుడు, హిరణ్యకశిపుడు మొదలగు వారెందరో దేవద్రోహులై అనేకములగు నుత్పాతముల కాధారభూతులైరి. వారితోకూడా అసురనాశకులగు దేవతలూ గంధర్వులే కాక ఎందరో ధర్మ వీరులున్నూ సృజింపబడుటచేత చదువరుల దృష్టి అసురుల వంకకు బోకుండా దేవతలయందే నిలుచును. మొత్తముపై ధర్మమునకే జయము తనరుచుండును; అందుచేత ఆర్య సాహిత్యము ధర్మజయమునే ప్రశంసించును.