పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16 సాహిత్యమీమాంస

చిత్రముల నచ్చొత్తుటతోనే తృప్తిపొందలేదు. తద్రచన యందు సొంతనేరుపుకానితనము కూడా చూపెను. ఆతడు చిత్రించిన మేక్‌బెత్ రాణివంటి స్త్రీ అలౌకికపాత్రమే, అనగా పృథ్వియందట్టి వ్యక్తి పొడచూపదు.

ఆర్యకవు లీమార్గమునకు వ్యతిరేకముగా తమరచనను సాగించి ధార్మికులలో అసాధారణ మూర్తులు నిరూపించిరి. ఎల్లెడ బరగుచున్న ధార్మిక మూర్తుల చిత్రించుటవలన ప్రయోజనమేమి అని యడుగవచ్చును; కాని ధార్మికవ్యక్తులంతటా కుప్ప తెప్పలుగా నున్నారని యెంచవద్దు. అదీకాక సాహిత్యమున చిత్రింపబడిన వ్యక్తివిశేషములు స్థిరరూపమున నిల్చిపోవును, కావున కవి వాటియం దసామాన్య రూపసమావేశ మొనర్చుచుండును. అట్టి రూపసృష్టి చేయునపుడు సర్వసామాన్య చిత్రరూపములు మదిలో నుంచుకొనవలయు. ఆర్యకవులు అసామాన్య శరీర సౌష్టవమునకు తిలోత్తమ నాదర్శముగా కల్పించి, బాహ్యసౌందర్యమున నామె యెట్టి అసామాన్య సృష్టియో, అందు కనుగుణముగ మానసికసౌందర్యముగల పాత్రములు కూడా తమ సాహిత్యము నందు చిత్రించిరి. తిలోత్తమవంటి అనుపమ శారీరకరచన షేక్స్‌పియర్ చేయక పోలేదు. ఆతని యాదర్శములు మిరాండా ( Of every creature's best=రత్నము) *[1] రోసలిండ్, హెర్మి

  1. * జాతౌ జాతౌ యదుత్కృష్టం తద్రత్నమితి కథ్యతే జాతికెల్లను మిన్నయై చనెడుదాని రత్నమందురు........