పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12 సాహిత్యమీమాంస

రింపవు. మానవులయందలి ప్రచండ పాశవప్రవృత్తుల ప్రబల రూపమున చెలరేగనిస్తే రక్తపాతము పరిణమించి తీరును, ఈప్రవృత్తులు పెరిగి పెరిగి తుదక మానుష. చర్యలగుటకూడా సహజము. ఈలోకమున వైరమెంత ప్రబలినా ఎక్కడో కాని రక్తపాతమున పరిణమింపదు, అదీ అతివిరళముగా గన్పట్టు చుండును. రక్తపాతమున కనువగు నవస్థలు జనులలో చాలా తక్కువ; జనసంకులములగు ప్రదేశములందుగూడా సాలుకు మూడో నాలుగో హత్యలు జరుగుచుండును. అట్టి బీభత్సకర్మలకు లోభమో, ద్వేషమో, వైరనిర్యాతనమో, స్త్రీయెడ సందేహజనిత క్రోధమో కారణమగుచుండును. ఇట్టి లౌకికావస్థలజూచి షేక్స్‌పియర్ వియోగాంతనాటకములు రచించెను. *[1]మేక్‌బెత్, ఒథెలో, ఇయాగో, రోమియో, బ్రూటస్, మూడవరిచర్డ్, జూలియట్, మేక్‌బెట్ రాణి మొదలగు అమానుషపాత్రముల సృష్టించి వియోగాంతనాటకముల నాతడు రచించెను. ఈపాత్రముల యందు యంత్రణ దు:ఖాగ్నియూ కలవు, తద్రచనయం దంతశ్శత్రుప్రాబల్యము మానవప్రకృతిని దాటి అసురసీమకు దాపగును.

శ్లెగెల్ అను జర్మను విమర్శకుడు మేక్‌బెత్ రాణిని "రంపెలాడి" అని నిర్వచించెను; అట్టి సాహసము, కృతఘ్నత నిర్దయా రాక్షసులకు చెల్లునుకాని మానవులందు కానరావు,

  1. * ఇవి షేక్స్‌పియరు నాటకములలో ముఖ్య పాత్రములు - ఈకథలన్నియు ఆంధ్రమున ననువదింపబడినవి కావున వానిచదువుట ఆవశ్యకము.