పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11 ఆదర్శము

బోధించి మానవమానసముల నావంక కాకర్షింప యత్నించిరి. ఒకరు నరకయాతనల సృజించి, అవి నిర్భరములని నిరూపించి, జనసమూహముల పాపదూరులుగ జేయ సమకట్ట, రెండవవారు స్వర్గసుఖముల సౌందర్యము నభివర్ణించి సుఖ లిప్సయెడ నందరి దృష్టుల నాకర్షించి ఇహమున పరసుఖము ననుభవింపజేసిరి. పాశ్చాత్యకవిశేఖరు డగు షేక్స్‌పియర్ నరకమూ దాని యాతనా సృజింప ఆర్యకవిశేఖరులగు వ్యాస వాల్మీకులు పుణ్యవంతము పవిత్రమునగు స్వర్గమును సృజించిరి. అసాధారణ కౌశలమున ఇరుతెగలవారూ ఇట్టి సృష్టి చాలాకాలము క్రిందట నొనర్చిరి. అందెవ రెక్కుడు కృతకృత్యులో తత్ఫలాఫలముల వీక్షించినచో నిశ్చయింపవచ్చును. హిందూసంఘమునను యూరోపీయ జనసంఘములయందు నెవ్వరధికతరధర్మశీలురు ఎవ్వరధికతర సాత్వికభావసంపన్నులు - ఎవరు దయ, దాక్షిణ్యము, క్షమ, భక్తి మొదలగు సుగుణో పాసకులు? వారిలో నెవరియందు ధర్మప్రవృత్తి ప్రబలము? - ఈప్రశ్నలకిచ్చే సమాధానములబట్టి తత్కవుల సృష్టి పలాఫలములు చదువరులు నిర్ణయించుకొందురు గాక.

షేక్స్‌పియర్ సామగ్రి యాతని సృష్టి కనుకూలముగ నున్నది. వియొగాంత నాటకములే ఆతని ప్రధానసాధనసంచయము. అందలి రచనాప్రణాళి నరకమును సృజించి తద్దు:ఖాగ్నిని యాతనానిచయమును కన్నులకు కట్టునట్లు చేయగలదు. ఆసురసృష్టి కా నాటకము లుపచరించునట్లు దైవీసృష్టి కుపచ