పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6 సాహిత్యమీమాంస

నకరవభరితమగు వనస్థలిని గండుకోయిల తనమధురగానమును వినిపించజాల నట్లూ అచ్చటచ్చట విరళముగా వర్ణింపబడిన ధర్మసౌందర్య మాంగ్ల సాహిత్యమున వన్నె కెక్క లేదు, దానిమర్మమువిస్పష్టము కాలేదు.

ప్రకృతి చిత్రకారులమని ఐరోపీయుల కొక అహమిక కలదు. ప్రాచ్యసాహిత్యమున మెచ్చదగు ప్రకృతిచిత్రణమే లేదని వారియూహ. ఆచిత్రణము రెండింటియందును కలదు గాని వాటిలో కొంత భేదమున్నది. ఆంగ్లసాహిత్యమున నగ్నరూపము ధరించిన ప్రకృతిమూర్తి ఆర్యసాహిత్యమున సాలంకృత యగు చున్నది. మానవప్రకృతి యందలి పాశవ ఆసుర ప్రవృత్తులకు ఆంగ్లసాహిత్యమున గౌరవము చెల్లుచుండ ఆర్యసాహిత్యమున దైవికభావములకే గౌరవము కల్గుచున్నది. దైవికప్రవృత్తిసమున్నతిచే మానవజాతికి చెందదగు మాననీయత ఆర్యచరితములందు వర్ణింపబడుటచేత ఆసౌందర్య ప్రభలలో ఆసుర ప్రవృత్తులు ప్రచ్ఛన్నము లైనవి.

ఆంగ్లేయ సాహిత్యమున నీవిషయమున వైపరీత్యము గానవచ్చుచున్నది. అందు మానవప్రకృతి యందలి పాశవ భావములు, ఇంద్రియ ప్రవృత్తులును ప్రధానవర్ణనీయాంశము లగుటవల్ల దైవభావములు దాగియుండును. విదేశసాహిత్యమున ప్రధానపదమునొంది ఆంగ్లజాతికి గర్వోన్నతినాపాదించు షేక్స్‌పియర్ నాటకవిమర్శనమున ఈవిషయము స్పష్టమగును. ఇతరాంగ్లేయ కావ్యసమాలోచన మనవసరము. ఆనాటక రాజ