పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4 సాహిత్యమీమాంస

దేమి? జగన్మోహన మగు ఆనాటకమందు ఋష్యాశ్రమము చిత్రింపబడెను. అందలి పశుపక్షిసముదాయములు శకుంతలయెడ ప్రేమపూరితములాయెను. ఏమి ఆశకుంతల సహృదయత! ఆమెప్రేమ ప్రబలి పతిభక్తిగా పరిణమించి ఆమెను తపస్వినిగా పరిపక్వ మొందించెను. ఇక దుష్యంతుని ధర్మా సక్తి వీక్షింపుడు. ధర్మమందలి అనురాగము చేతనేకదా తన యెదుటపడి పతిభిక్ష నిడుమని యాచించిన శకుంతలను ఆతడు ప్రత్యాఖ్యాన మొనర్చెను. అసమలోభనీయమగు నామెయెడ నిట్టి ఆచరణము అన్యులందు సంభవ మగునా? తరువాత ఆమె వృత్తాంతము జ్ఞప్తికిరాగా ధర్మకాతర దగ్ధ హృదయముతో నాతడు పెట్టిన మొర లెవని హృదయమును కరిగింపజాలవు? ఈధర్మానుతాపమును "చిత్రదర్శన" ♦[1] అంకమున ఉజ్వలరూపమున కవి రచించెను. ఇంతకన్న ఉజ్వలతరమగు ధర్మానుతాపమును గాంచవలెనన్న భవభూతిరచితమైన ఛాయాదర్శనా*[2]౦కమున లభింపగలదు. అందుశ్రీరాముని భగ్నహృదయము ప్రతిబింబించును. ఇట్టి చిత్రముల నవలోకించినవారు ఆర్యసాహిత్యమును పఠించుటచేత వారి హృదయములు ధర్మానురాగ పరిపూరితము లగునో కావో యించుక తెలియచేయుదురుగాక. మానవహృదయము లెక్క లేని కళంకములచే కలుషిత మయినను ఆర్యసాహిత్యపఠనము

  1. ♦ శాకుంతలమున ఆరోఅంకము.
  2. * ఉత్తరరామచరితమున మూడోఅంకము.