పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3 ఆదర్శము

రామచంద్రుని పుణ్యశస్త్రస్పర్శచే నిష్పాపుడై ముక్తుఁడయ్యెను. *[1]

పౌరాణికములగు ఈగ్రంథములను వీడి సాహిత్య క్షేత్రమున కవతరింతము. దానికధ్యక్షులగు కాళిదాసు, భవభూతి, మాఘుడు, శ్రీహర్షాదిమహాకవులందరూ తమగ్రంథ లందు ధర్మసూక్ష్మములనే బోధించి యున్నారు. కాళిదాసు తన అపూర్వరచనా కౌశలమున కుమారసంభవ మందు ధర్మమయమగు చిత్రమునే రచించెను - పార్వతి తపమూ హిమవంతుని శివానురాగమూ అసాధ్యసాధనలు కావా? వీటి యుజ్వలాభాసముచే ఆకావ్య మలౌకిక మగుచున్నది. ఇక శకుంతల - భువన విఖ్యాతనాయకి - గూర్చి చెప్పే

  1. * శ్రీమద్రామాయణము మహాభారతమును కేవల ధర్మోపదేశమునకై రచించినగ్రంథములేకావు. వాటియందు రాజనీతి, సాంఘికనీతి, ధర్మనీతి, లోకనీతియు గానవచ్చుచున్నవి. ఇవి కేవల మహాకావ్యములే యనరాదు, యుగయుగాంతరములనాటి సమాదరణీయసామగ్రి అందున్నది కావున వీటిని భారతవర్షేతిహాసము లననొప్పు పితరులయెడ సంతానమున కుండదగిన అణకువ, సోదరులయెడ జూపదగు ఆత్మత్యాగము, ప్రజల యెడ రాజుకుగల కర్తవ్యము, బ్రాతృవిరోధమున ఘటిల్లు దుష్పరిణామము, రాజ్యేషణ, అసాధారణాధ్యవసాయము, ఉచితమార్గానుసరణము మొదలగునవి దృష్టాంతసహితముగా కన్పరుపబడినవి. వీటిప్రాబావమున వేయిసంవత్సరములక్రిందట భారతవర్షమున ఎట్టిశాంతి నెలకొల్పబడెనో యిప్పటికి అట్టిశాంతియే పరిడవిల్లుతూంది. గ్రంథకర్తలధర్మవిషయికోపదేశము లచ్చటచ్చట పొడగట్టుచుండుట చేత ఇవి కేవల ధర్మోపదేశగ్రంథములని పాఠకు లూహింపరాదు.