పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

191 దేవత్వము

ఉంటే గృహస్థు స్వర్గసుఖ మనుభవిస్తూ ఉండును. వారి కిహమే పర మవుతుంది, వారు దివ్యులౌతారు.

వ్యభిచారమునకు కారణములు-మద్యపానము, దుస్సాంగత్యము, భర్తృవిరహము, ఇల్లిల్లుతిరుగుట, అకాలనిద్ర, పరగృహవాసమనునారని మానవధర్మశాస్త్రమం దున్నది. ఇవి స్త్రీపురుషులకు వర్తించును. ఈ పరిస్థితులను రూపుమాపుట వలన వ్యభిచారము కొంత తగ్గును. మేల్కొని యున్నంతకాలమూ పురుషుడు కుటుంబపోషణమునా స్త్రీ గృహకృత్యనిర్వహణమునందున్నూ కాలము వినియోగించవలెను. చేతినిండా పని ఉంటే చెడుతలంపుల కవకాశ ముండదు. పైని చెప్పిన సాధనముకన్న ఉత్కృష్టమైనది భార్యాభర్తల పరస్పరానురాగము. ఇది హెచ్చినకొద్ది వ్యభిచార మేహ్య మనిపించును. వృధావాగ్వాదమువల్లనూ చికిలిజగడములవల్లనూ కలహములను పెంచుకొని మనసు విరుచుకొనక క్షాంతి, దాంతుల నభ్యసించి సమానురాగులై యున్న దంపతుల చెంత వ్యభిచారము చేరనేరదు.*[1]

  1. * వ్యభిచారమునుగూర్చి మనవారు చేసిన కట్టడి చాలా గట్టిది. ఇది కేవలము కాయికముగానే తలపబడలేదు. మనసులోనూ మాటయందైనా స్త్రీపురుషుల చిత్త మన్యాయత్తము కాగూడని మనవారి నియమము... స్త్రీలను మూడు తెగలుగా భాగించవచ్చును: _ కలలోనైన అన్యపురుషుని దలపక, సర్వము పతియే అని భావించు నారీమణి "సతి" అత్యుత్తమురాలు. పతినిగాక అన్యుల దలచినా వారి నందరినీ సోదరభావమున జూచునామె ఉత్తమురాలు. ఇతరులయెడ నింత ఉత్కృష్టభావనలేక అందరూ ఏమనుకుందురో అను బిడియము చేతకాని వీలు చిక్కకపోవడముచేతకాని వ్యభిచరించనిది మధ్యమ. పతిని పూరికైన కొనక ఇతరులతో సంచరించునది అధమురాలు. పతి నగౌరవపరచు కాంత పశువుతో సమానము. ఈ పద్ధతి పురుషులకుకూడా వర్తించును.