పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/20

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సహిత : _ అనగా హితము కోరువాఁడు, హితము చేయువాఁడును "సహితుడు" వాని భావము "సాహిత్యము." ఇందు 'సహిత' అను శబ్దమునందలి ఉపసర్గము వేరు చేయ బడినది. (స+హిత) ఈయర్థమును గ్రహించితి మేని మనకు హితము చేయువాని భావము సాహిత్యమగును. హితము చేయువస్తువు (గ్రంథము) అనికూడా అన్వయించుకోవచ్చును. ఆలాగైతే కావ్యములు, ఇతిహాసములు శాస్త్రములు, కోశములు, మొదలగు నవన్నియు సాహిత్యమున చేరును. ఇతిహాసములం దీయర్థమే కనబడుచున్నది. అప్పుడు "వాఙ్మయ" మనునది "సాహిత్య" పదమునకు పర్యాయ మగును.

ఇక సాహిత్యమునుగూర్చి యించుక చర్చింతాము. మన ఆత్మ చిదానందస్వరూపము. ప్రీతి, స్నేహము, దయ, భక్తియు సాత్వికభావావస్థలు. ఈభావములను వ్యక్తీకరించుట యందు కావ్యములు మనకు సాయము చేయును. వాటిని పఠించి తద్గతభావములను హృద్యము చేసుకొని కోశత్రయాత్మకమగు సూక్ష్మశరీరమునందు సద్భావములను సంగ్రహింతుము. కావ్యములు లోకోత్తరానందము నిచ్చును. దర్శనాదులచే మనము జ్ఞానోపార్జనము చేయఁజాలినమా మనకానందము గలుగఁజేసి సౌందర్య సామ్రాజ్యముకు దారి చూపేవి కావ్యములే.

దర్శనములూ, శాస్త్రములూ సాహిత్యగ్రంథములలో జేరినా సాహిత్యశబ్దము వాటియందు వర్తింపదు. ఎందు