పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

159 వీరత్వము

బ్రహ్మతేజము పరశురాముడై అవతరింప క్షాత్రతేజము శ్రీరాముడై అవతరించెను. బ్రహ్మతేజ మాభ్యంతరిక సమరమందున్నూ క్షాత్రవీర్యము బాహ్యసమరముననూ ప్రజ్వరిల్లునని చెప్పియుంటిమి. అందుకే బాహ్యసమరమున పరశురాముడు శ్రీరామునకు తీసిపోయెను.

ధర్మార్థము బలిదానము

ఆర్యసాహిత్యమున వృథారక్తపాత ముండదు, రక్తస్రావ మున్నచోట్ల ధర్మనిర్వహణ ముండితీరును; దేవకార్యార్థము చేసిన రక్తపాతము "బలి" అనిపించుకొనును. బలిదానము పవిత్రకర్మ అని షేక్స్‌పియర్ కూడా ఒప్పుకొన్నాడు. సీజరును చంపవలెనని లోభముగ్ధుడై కాసియన్ రోమనువీరుల కుచక్రము (Conspiracy) లేవదీసెను. తన చాతురి వినియోగించి బ్రూటసునుకూడా మందలో చేర్చెను. అతడు చేరుకున్న ఆకార్యమునకు గౌరవము చేకూరదని కాసియ సెరుగును, బూట్ర సాకర్యము ధర్మనిబద్ధము కావున బలియగునని వారి కిట్లు బోధించెను: _