పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/18

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లను నిర్ణయించు (లక్షణ) గ్రంథములపట్ల రూఢిగా ఉపయోగింప బడుటచేత రఘువంశాదికావ్యములకు సాహిత్యశబ్దమును వాడరు.

కావ్యశబ్దమునకున్నూ ఈదశయే పట్టినది. కావ్యమనగా ప్రాయికముగా పద్యగ్రంథ మని తలంతురు. కొన్ని కావ్యములయందు గద్యపద్యములు యథేష్టముగా వాడఁబడుచున్నా కేవల గద్యమయగ్రంథమును కావూ మనుట లేదు. ఇంకొక విశేషము. ఏవో కొన్ని పదములుచేర్చి పద్యము లల్లినట్టయినా దానియందు భావము శూన్యమైనా దానికి కావ్య మనుపేరు చెల్లుతుంది. ఇక గద్య మెంత రసవంతము, సుందరము ఎంతభావభరిత మైనా దానిని కావ్య మనరు. అది రచించినవారిని కవులనరు.

ఈ సంప్రదాయముచిరకాలీనమై వస్తూన్నది. వస్తుత: కావ్య మన్నను సాహిత్య మన్నను ఒకటే, భేదము నామ మాత్రమే. భాష యెట్లున్నను, శైలి యెట్లున్నను, గద్యము కానీ, పద్యముకానీ, గీతముకానీ రసవంత మైనచో దానిని సాహిత్యమనికాని కావ్య మనికాని అనవచ్చును.

ఇక సాహిత్య మెట్టిదో విచారింతము. "సహిత" శబ్దమునకు ష్యఞ్ (అ) ప్రత్యయము చేర్చితే "సాహిత్య" అను పదము నిష్పన్నమవుతుంది. ఈశబ్దమునకు పక్రరణానుసార మీక్రింది యర్థములు ఏర్పడినవి.