పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సాహిత్య మీమాంస

ఉపోద్ఘాతము

సాహిత్య మన నేమి

సాహిత్యశబ్దార్థము జటిల మైనది. దీనిని పలువురు వేర్వే రర్థముల యందు వాడుచున్నారు గావున దీని యర్థ నిర్థారణ మావశ్యకము. అది తెలియకపోతే సాహిత్యమీమాంసయెట్లు చేయగలము?

"సాహిత్య గ్రంథములు" అను పదము వినినతోడనే సాహిత్యదర్పణము, కావ్యప్రకాశము, రసగంగాధరము మున్నగునవి స్ఫురించును. రఘువంశము, కుమారసంభవము కావ్యములని పరగుచున్నవి. ఇవి సాహిత్యగ్రంథములు కావా? అని ప్రశ్నించిన ఉత్తరము తక్షణ మాలోచనీయమగును. మొదట వివరించిన మూడు గ్రంథములయందూ ప్రతి పాద్యమైన విషయ మొక్కటే అయినా వాటిపేళ్ళలో సాహిత్యము, కావ్యము, రసము నను మూఁడుశబ్దములు వాడఁబడియున్నవి. రఘువంశాదులు కావ్యములుకదా వాటిని సాహిత్యగ్రంథము లనఁగూడదా? సాహిత్యమూ కావ్యమూ వేరయితే భేదమెట్టిది? దీనికి జవాబిది: - సాహిత్యశబ్దము రసము, గుణము, రీతి, అలంకారము మొదలగు విషయము