పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120 సాహిత్య మీమాంస

చుట మన కవశ్యకర్తవ్యము. తదుత్తేజనమున మనస్త్రీజాతికి రానున్న బలము ధైర్యమున్నూ మేరు మందర సమానములు. నిర్లంఘ్యమగు ఆ బలము మనస్త్రీల కబ్బితే వారి కితరనైతిక ధర్మములతో ప్రసక్తిలేదు. కావున పురాతనసతీత్వగౌరవము నుద్ధరించు నుపాయముల కల్పించుకొని తత్ప్రతికూల సాధనముల బహిష్కరించుట మనకు విధి.

స్త్రీల సంయమబలము.

సతీత్వగౌరవము నిలువబెట్టుకొనుటకు కౌసల్య అపూర్వాత్మసంయమ మగపరిచింది. తనభర్త కై కేయికి పూర్ణముగా వశుడగుటచే సవతియు ఆమెచెలికత్తెలూ అన రాని మాట లనుచుండ, అవి, శల్యములవలె ఆమెమనసున నాటి అగ్నికన్న నెక్కుడుగ దహింప జొచ్చెను. అప్పటికేనా ఆమె పతియెడ ప్రేమ విడువక శ్రీరాముడు రాజగునప్పుడు తన దు:ఖములన్నీ అంతరించునను ఆసతోనుండి అట్టి సమయ మాసన్నమై ఆమె లోలోన సంతసించుచుండ, శ్రీరాము డామెను చేరంజని వనములకుబోవ అనుమతి వేడెను. ఆమె గుండె అప్పుడు శతధావ్రయ్యలై దృష్టిపథ మంధకారావృత మాయెను. వెంటనే హృదయమున శిశువాత్సల్య ముద్బోధ మగుటచే ప్రాణములకన్న ప్రియతరుడగు పుత్రుని వనమున కంపి అయోధ్యయం దామె ఉండజాలనని నిశ్చయించి, రామునితో వనమున కేగుటయే శ్రేయమని యెంచి, ప్రయాణోన్ముఖి యై ఎవ రేమిచెప్పినా పెడచెవిని బెట్టింది, కాని శ్రీరా