పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

119 మానవప్రేమ

ఈబంధములకు లోబడి సంయములు కాగలవాళ్ళు దివ్యత్వమున కహున్‌లవుదురు. ఇట్టి సంయమము సిద్ధించుటకు సానుకూలమగు సాధనయే మానవవిశిష్ట ధర్మమగును. ఇట్టి మనుషత్వమే ఆర్యసాహిత్యమున చిత్రింపబడినది.

సతీగౌరవము - తద్ధర్మబలము

పూర్వకాలమున భారతరమణులు సతీత్వగౌరవపరిపూర్ణలై వీరతయు సంయమమును వెల్లడిజేసిరని ఆర్యసాహిత్యము దెలుపుచున్నది. ఆ గౌరవస్ఫూర్తిచేతనే తమపవిత్ర శీలమును నిల్పుకొనుటకై వారు ప్రాణములవీడుటకు సయితము వెనుదీయలేదు. శత్రువుల వెఱపుచే నెందరో రాజపుత్ర మానినులు సర్వభక్షకున కాహుతులైరి. సతీత్వగౌరవాపేక్ష చేతనే హిందూసుందరులు పతుల యనంతరమున జీవింప నొల్లక వారితో సహగమనము సల్పుచుండిరి. కోరి అగ్నిలో బడువారి గౌరవనిష్ఠయు అంతరంగబలమును సర్వసామాన్యము లనజెల్లునా? ఆ బలము నాధారము గావించుకొని వా రలౌకిక సంయమ మగపరచి పతుల యోగక్షేమములకై పడరాని పాట్లుపడి, సకలదు:ఖముల సహించి, సర్వమున్నూ విడుచుటకు సన్నద్ధులై యుండిరి.

ఇప్పుడు సతీత్వగౌరవము సన్నగిల్లింది కావున మన స్త్రీల కంతరంగబల మంతరిస్తూన్నది. పూర్వుల ప్రవర్తనము కన్న ప్రబలోత్తేజన సాధన మింకొకటి మనము సృజింపగలమా? అట్టిచో సాటిలేని పురాతన సతీత్వగౌరవమును పోషిం