పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118 సాహిత్య మీమాంస

ప్రాప్తించును, మనుజున కవి యత్న సాధ్యములగును; కావుననే మానవుడు దేవతలకన్న తక్కువవాడు. ఇట్టి యుపాయావలంబనము ఎవరికి సహజసిద్ధమౌనో వారియందు దేవత్వము వికసించును; ఇందు కనుకూలములగు నయరీతులు నియమములు హిందూసంఘమున కలవు; ఆ శిష్టాచారముల ననుసరించుటవలన మానవునకు పశుత్వపరిత్యాగము దేవత్వప్రాప్తియూ సిద్ధించును. వీటి నలవడజేయు సంయమమే హిందూ సంఘమునకు ప్రధానబలము; ఇది అతిశయించినకొద్దీ దేవత్వ ప్రతిష్ఠ ఉత్కృష్టమగును. హిందూసంఘ శిష్టాచారములు దేవత్వప్రాప్తికి కారణభూతము లగుటచే వాటిని త్యజించుట దేవత్వమును తొరగుట కాదా? *[1]

  1. * వేదవిహితంబులును శాస్త్రవిహితములును శిష్టచరితంబులునుననజెప్పనొప్పి ధర్మములు మూడువిధముల దనరుచుండు కడగి యిన్నియు సద్గతికారణములు

                         దానంబు సత్యంబు తపము యజ్ఞము నార్జవము కామలోభాది వర్జి తంబు గురుజన శుశ్రూష క్రోధరాహిత్యంబు దమము సంతోష మధ్యయననిరతి దాంబికత్వములేమిదైన్యంబువొరయమి, అనసూయ అనహంక్రియాభియుక్తి తలపంగ నాద్యమైతనరు ధర్మమునెప్డుకొని యాట నాస్తికగోష్టి జనమి శీలసంరక్ష తీర్థసంసేవ శౌచ మఖిలభూతంబులందు దయార్ద్రుడగుట మితహితోక్తులు సంశ్రిత మిత్రగుప్తి ఇన్నియును శిష్టచరితంబు లిద్ధ చరిత. అనయంబున్ శమవంతుడై వినుత శిష్టాచార మార్గంబులం జను పుణ్యాత్ముడు దుర్గతుల్ గడచి ప్రజ్ఞాహర్మ్య సంరూఢుడై కనుచుండుం బటు మోహపంకజల మగ్నంబైన లోకంబు వీ కనధోభాగమునందు డింది కడుదు:ఖం బొందగా నవ్వుచున్|| .........నన్నయ