పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

117 మానవప్రేమ

డుపాయములు సూచింపబడినవి : _ పాపమందలి భీషణపరిణామముల పరికించి దానివిడనాడుట మొదటిది, పుణ్యస్ఫూర్తి సంపాదించి పాపమునకు దూరగులగుట రెండోది; ఇంతేకాక, పుణ్యము ప్రబలినకొద్దీ పాపము తనంతన తరిగిపోవు ననుటకు ప్రత్యక్షనిదర్శనముల జూపిస్తూ, పుణ్యమందును దేవత్వమునను ఉన్నతాదర్శముల నెదుటనిల్పి పాపమును పరిహరింప జేయుటయందు ఆర్యకవులు మంచి నిపుణత జూపిరి. అట్టి యాదర్శములయందు చిత్తమును జొత్తిలజేయుటే మనుష్యత్వ మనబడును.

మానవప్రకృతియందు పాశవప్రవృత్తులు ప్రబలియుండుటచే మనుజుడు స్వాభావికముగా వాటి నుపాసించుచున్ననూ, దేవత్వము వానిని తనవై పాకర్షించడము మానదు. పాశవ ప్రవృత్తులు దు:ఖభాజనములు, దేవప్రవృత్తులు సుఖాగారములు; మొదటివి క్షణికసుఖమే ఒనగూర్పకలవు, రెండోవి చిరస్థాయియగు సుఖమును చేకూర్చును: అవి సుఖదు:ఖముల కాకరములకును, ఇవి కేవల సుఖ మాపాదించి చిత్తముకు శాంతిని ప్రసాదించును. ఈ శాంతికై దేవురించు మానవుడు పాశవప్రవృత్తిని పరిత్యజించి, చింతనవల్లా వివేచనాశక్తిచేతా నిర్మలచేతస్కుడై ఎప్పుడును తత్సదుపాయములనే వెతకుచుండును. వీటిని పరిశీలించి వశపరచుకొనుటయందే వాని మనుష్యత్వము విదితమగును; పశుసీమ నాతడు దాటుటకు ముఖ్యసాధన మిదే. దేవతల కిట్టి సదుపాయములు వాటికవే