పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

115 పాశవప్రేమ

దానికన్న ఘనతరమగుదానినే కవి కల్పిస్తూ ఉండును. అది మానవహృదయముల నాకర్షించి వాటిని శుద్ధిచేసి తత్ప్రవృత్తుల సత్పథమున వర్తిల్లజేయును. వీటినే ఆదర్శము లందుము. సీతా సావిత్రీ పాత్రము లిట్టివే.

అంతశ్శత్రుప్రాబల్య మతిశయిస్తే వర్ణాశ్రమధర్మబంధములు తెంచకతీరదు, అంతతోగాని అది చరితార్థము కాదు. ఇందుకు డెస్‌డెమొనా జూలియట్ పాత్రములే తార్కాణములు. సంసారబంధములు, రాజ సంఘ శాసనములు మొదలగువాటిని ఉల్లంఘించకుండా ప్రేమ యెంతవరకూ స్పందించునో, అట్టి ప్రేమయందు నైతికసౌందర్య మెట్లు నెలకొనునో ఆర్యకవులు నిదర్శనములతో చూపిరి. కామక్రోధాదులు సర్వజంతుసామాన్యములు, అవి మితిమీర విజృంభింపకుండా చేయుటయే మానుషము, ఆర్యసాహిత్యమున నెల్లెడ నిట్టిమానవపాత్రరచనయే కాన్పించును.