పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

113 పాశవప్రేమ

మొనర్పలేక తూష్టీంభావమున తలవంచి నిలువబడినది. మానవప్రకృతి అంతటా ఒకతీరుననే ఉండునుకదా, సంఘ సంసర్గమే లేని మీరాండా నాగరక ప్రౌఢభావము తనకు నిసర్గముగ నావిర్భవించినట్లు వ్యహరించె ననుట వింతకాదా? జూలియట్, రోసలిండ్, బియాట్రిన్, ఇమోజెన్, డెస్‌డెమొనా మొదలగు నాగరికప్రౌఢల మనోభావములు మిరాండాకు సహజములగునట్లు కవి సృష్టించెను. శకుంతలయందలి సారళ్యము, వ్రీడ, నిసర్గయువతీప్రేమయు పాశ్చాత్య యువతీ సంఘమును గాలించి వెదకినా గానరావు; అట్టికల్పన పాశ్చాత్యులకు అసలే స్ఫురించదు, ఏకవేళ స్ఫురించినా వారిప్రకృతి ప్రతిరూపము కానందున వా రట్టిరచన చేయనే చేయరు. మానవప్రకృతియందలి ఆ మెచ్చు ఆర్యసాహిత్యమునకే తగును.

మీరాండాసరళతయందు సాహసము మిళితమయినందున లజ్జయెట్టిదో శమమెట్టిదో ఆమె యెరుగక పోవడముచేత మనసులోని మాటలు వెలిపుచ్చెను. మనోభావములను మాటలతో నెరిగించుటయే సరళత యైనచో ఫెర్డినెండుతోడి ప్రణయసల్లాపమున మిరాండా సరఖస్వభావ అనకతీరదు. హృదయోద్వేగమున వెడలు మాటలు అకృత్రిమములు సరళము లనుటకు సందేహములేదు. మిరాండావ్యవహారము స్వాభావికమని ఒప్పుకొన్నా, అది యెంతవరకు సంభవమో పరీక్షించవలెను. ఆమెనోట వెడలు చతురవాక్సరణి, వివాహ