పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112 సాహిత్య మీమాంస

వస్తూన్నది. ఇది స్వల్పవిషయము. నేను దేనిని మరుగుజేయ యత్నిస్తున్నానో అది బయటి కుబుకుచున్నది. లజ్జ వగలారా, నన్ను వీడి పొండు. ఆర్జనమా! అమాయికత్వమా! నాకు బాసటై నిలవండి. నీవు నన్ను పెండ్లియాడెద వేని నీకు పత్నినై మెలంగెదను, లేకున్న నీకు దాసినై మనియెదను. నన్ను పెళ్ళియాడెదవో లేదో నీచిత్తము, నీకు దాసి నగుటకు నీ వొప్పుకొన్నా మానినా నేను మానను.

ఫెర్డి - నీవు నాకు ప్రాణములకన్న ప్రియతరవు, నేను నీదాసుడను.

మిరా - నాకు భర్త వగుదువా ?

ఫెర్డి - మనస్ఫూర్తిగా-ఇదే బాసచేస్తున్నాను.

మిరా - ఇదే నీ దాసు రాలను.

చాతురీభరితములగు నిట్టిమక్కువమాటలు మిరాండా ఎక్కడ నేర్చుకొంది? అంతకుపూర్వము పురుషులనే కాంచ లేదు, మూడేళ్ళవయస్సున నిర్జనద్వీపమున నిర్వాసితురాలయి పండ్రెండేళ్ళు తండ్రినిగాక ఇతరుల నెరుగదు. ఘోరాట విని గ్రుమ్మరునామె కిట్టి వాగ్రచనాచాతురి ఎలాగబ్బింది? శకుంతలకు ఇతరజన సాంగత్యమైనా కద్దు - ఋషికుమారు లుండిరి, కణ్వునిజూడ పలువురు వస్తూ పోతూ ఉండిరి; ఆమె నోట నిట్టి చతురవాక్యములు రాలేదు! పెండ్లిమాట నెత్తుటకైనా ఆమెకు సాహసము లేకపోగా, దుష్యంతుడే ఆప్రస్తావముపక్రమించెను; అప్పటికీ ఆమె ఇట్టికౌశలమున ఆత్మోన్మీలన