పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

107 పాశవప్రేమ

మౌనమును ప్రకృతిసంగతముగా వర్ణింపబడినవి, యూరోపీయ సతులయందలి దిట్టతనము, ఆగడము, వాచాలత కానరావు. నిర్లజ్జాకలితప్రౌఢ యైనచో రాజుప్రేమకు పాత్రము కాకపోవును. భావవ్యంజకనీరవత ప్రౌఢల కుండునా? యువతులకు లజ్జ మౌనమూ భూషణములు. క్రెసిడాయందలి ఛలము, ప్రేమ ప్రకాశకవాక్యసరణి, క్రియాకలాపము, జూలియట్, ఇమోజెన్, హెలెన్ హెర్మియాల ధృష్టవ్యాపారములును ఆర్యయువతుల మితభాషిత్వముకు సాటిరావు. కులాంగనలయందు ధృష్టత అసంగతము అసంభవమని ఆర్యులసిద్ధాంతము. ప్రేమ నంగడినమ్ము పాశ్చాత్యులయం దిట్టివి చెల్లును. ప్రేమభిక్షా ప్రార్థనము (Court-ship) వారిలో సదాచారము, దీముమాట లాడియూ మక్కువసేతల చేసియూ మరులుకొల్పి కాంతల కరగతల చేయుటయే దీని ముఖ్యోద్దేశము. ఆర్లెండో రోసలిండు నెడ అవలంబించిన దీ ప్రక్రియయే; దీనిని పతిపత్నులవేట యననొప్పు. వనితలను వలలో వేసుకొన దలచినవారు మనసులోనున్న దానికన్న నెక్కుడుప్రేమ నటింపవలయును. *[1] ఇది ప్రేమవిడంబన మగునుగాని నిజమైన ప్రేమకాదు. ప్రేయసుల

  1. * Ferd - Full many a day I have eyed with best regard, and many a time The harmony of their tongues hath into bondage Brought my too diligent ear; for several virtues Have I liked several woman; never any With so full soul, but some defect in her Did quarrel with the noblest grace she owed, And put it to the foilː but you, O you, So perfect, and so peerless, are created Of every creature's best. (The Tempest Act III)
    • పలువుఱ బొలతుల బాగుగనే నారసినవాడ, నావాడివినికి వారి మాటతేనియ పెక్కుమార్లు దాసింజేసి; నానావిధస్త్రీల కేను వివిధ గుణములబట్టి మక్కువపడినాడను; గాని యెవ్వతెకైన గల్గినట్టి చెలువుతో జగడముచేసి దానిన్‌బాడుచేయులోపం బెద్దియూ యొనరెడు గనుక నామనసార నేకల్కినైన నేను మోహించ లే దెన్నడైనగాని; నీవెపరిపూర్ణురాలవునిరుపమముగ, సలుపబడితివెల్లరి! మెఱుగులమొనపయి ఆ|| నా || దా||