పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102 సాహిత్య మీమాంస

చిత్తశాంతి శిథిలముకాగా, వేడి నిట్టూర్పులతో వేడికన్నీరోడ్చుచూ ఉండగా, జూలియట్ ఆతని దృష్టిపథమున బడెను. అంతట నాతనిలక్ష్యమూ అవస్థయూ ఒక్కరాత్రిలో మారెను. పిమ్మట జూలియటుపై మరులుకొని వికలచిత్తుడై, ఆమెయింటిచుట్టూ తిరుగుతూ పొంచిపొంచి కిటికీదగ్గరకు బోవును. డెమెట్రియస్ హెర్మియాను చూచి యిట్లే చిత్తవైకల్యమునొంద, అంతవరకూ ఆతనిహృదయమున నెలకొన్న హెలెనా అపసరిల్లింది. ఇట్టిప్రేమ పాశ్చాత్యులకు చెల్లునే కాని మనకు చెల్లదు. దీనిని మనము ప్రేమగా గణించక "లాలస" అందుము.

వాల్మీకి ధర్మవీరుని చిత్రింపనెంచి శ్రీరాముని పాత్రమును నిర్మించి మానవుల ముగ్ధుల నొనర్చెను. పిమ్మట అందుకు ప్రతిగా ఇంద్రియపరాయణుడగు రావణుని పాత్రమును సృజించెను. ధర్మవీర్యవివశీకృతులై అందరూ రావణుని గర్హింతురు. అదేరీతిని మొదట పవిత్రము సుందరమునగు సీతపాత్రమును నిర్మింప, తచ్చిత్రముగ్ధులై అందరునూ ఇంద్రియపరాయణ, కామమోహిత, లజ్జాహీనయునగు శూర్పణఖను చూచి గర్హించి, ఆమె ముక్కు చెవులు లక్ష్మణుడు కోయునప్పుడు ఆపని మెచ్చి అతని ప్రశంసింతురు. ఆర్య సాహిత్యమందలి చిత్రము లిట్టివి.

షేక్స్‌పియరు నాటకరచనయందలి పరిణామ మిట్లుండదు. వాటియందు మొట్టమొదటనే దుర్దమాంత:శత్రుచిత్ర