పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

101 పాశవప్రేమ

స్వాభిమానము మాత్రమే ఉండును. ఎన్నియున్నా భక్తిమయైకనిష్ఠ, పుణ్యప్రతిచ్ఛవియు లేనందున ఆప్రేమ పవిత్రము దివ్యమునూ కాజాలదు. అందు మానవప్రకృతియందలి మాధురి ఉందిగాని దివ్యప్రకృతియందలి సౌందర్యము లేదు. మాధుర్యమునకూ ఆనందమునకూ తోడు నిర్మలశోభా వికాసము లేకున్న ప్రేమకు సర్వాంగసౌందర్య మలవడదు.

పాశ్చాత్యసాహిత్యమందలి ప్రేమసౌందర్యము ప్రాయికముగా ఇంద్రియలాలసావిలాసక్షేత్రమున ప్రస్ఫుటితమగుచుండును. ఆక్షేత్రములే దేశదేశములందు కళంకబీజముల నాటుచున్నవి. నిసర్గప్రేమసవంతి కామాసక్తి అను పంకముచే కలుషితముకాగా అంత:శత్రువిరోధము దాని గమనమును మందగించి పెక్కుచోటుల సరికట్టుచుండుటచేత షడ్రిపు ప్రభుత్వమే సర్వత్ర సాగుచున్నది. మానవులయందు పాశవ ప్రవృత్తి మితిమీరితే వారియందలి మానవత్వమునే కాక దేవత్వమును కూడా నశింపచేయును.

ఆర్యసాహిత్యమందలి సీతవంటి సతీమణిని పాశ్చాత్య సాహిత్యమున గాంచనగునా? హోమరు రచితయగు హెలెన్ సీతకు ప్రతియోగిని (సాటి)గా చేయవచ్చును, కాని అట్లెంచుట స్వర్గమునకు నరకమును సాటితెచ్చుటే! ఇక షేక్స్‌పియరుసృష్టిని తిలకించితిమా, మనము వెదకపోవు ప్రేమ మందునకైన కానరాదు. రోమియో మొదట రోసలీన నునామెను చూచి, మోహపరవశుడై, నిద్రాహారములుమాని