పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

99 పాశవప్రేమ

మున సఖ్యప్రేమయందలి సౌందర్య మినుమడించును; వీటికితోడు భక్తి ఉదయించుటచేత ఆప్రేమ పరమపవిత్రమగును. సఖ్యభావమున మాధుర్యమూ, భక్తిభావమున పవిత్రతయూ, మేళవించుటచేతనే ఆర్యనారులు కమనీయశీల లగుచున్నారు. శుశ్రూష సల్పునెడ పతి దైవమును, సల్లాపము సల్పునెడ సఖుడు నగును. ఆర్యనారిగౌరవము గరుపమును సత్యవలంబనమున ప్రభవించు లక్షణములు. మానినియగు భార్యకన్న భర్త కెక్కు డాదరపాత్రమగు పదార్థము లేదు.

సతి కుపిత అయ్యెనా ఏలాగైనా ఆమె నూరడించడము పతికి విధ్యుక్తధర్మము. అందుచేతనే రాజప్రసాదముల యందు రాణుల కోపగృహములు ప్రత్యేకముగా నిర్మింప బడుచుండెను. రాణి అలిగినచో రాజ్యమిచ్చియైన ఆమె ననునయించుట రాజధర్మము కావడముచేత కైకకోపోపశమమునకై దశరథుడు ప్రాణాధికుడు సర్వజనాభిరాముడునగు శ్రీరాముని ఘోరాటవుల కంపెను. దురపిల్లు వై దేహిని సమాశ్వసింప శ్రీరాము డంత:పురమునకు చనెననియు, పిమ్మట చిత్రదర్శనముననూ మధురాలాపములచేతనూ ఆమె దు:ఖ మపనయించి వెనుకటి దాంపత్యసుఖమును జ్ఞప్తికిదెచ్చి సుఖానుభూతి సమకూర్చెనని ఉత్తరరామచరితమందు కనబడుతూన్నది. లంకావిజయానంతరము కుబేరపుష్పకముపై అయోధ్యకు పోవుచూ శ్రీరాముడు సరస సల్లాపములచేతను తన కీర్తిపరిచయముచేతను సీతహృదయమున కానందము