పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

95 పాశవప్రేమ

అయింది. దేవతలని వారికిమాత్రము పాపకళంకము తప్పిందా? మహాకార్యముల సాధించునప్పుడు తప్పనిసరి యైనపట్ల కామోదయము కల్పింపబడినది, కాని చెడుతలంపుచే కాదు. మహాత్ము లవతరించుటకూ కామోదయము కావలయునే! అభీష్టసిద్ధి యగునంతవర కవి ప్రబలి పిమ్మట అంతరించును.

ఆసక్తియు లాలసయు నుండుచోట్ల పాప ముండితీరును, కాని ఆసక్తి హీనమగు కార్యము పాపపంకిలము కానేరదు. అట్టి కార్యమునకు ఫలముండదు; అది పాపముగానీ పుణ్యముగానీ కానేరద(Non-moral)ని భగవద్గీతలయందు చెప్పబడినది. కేవలస్వభావజనితకార్యములన్నీ దైహికములు. అవి ఆసక్త్యనురాగ సహితము లయినప్పుడే పాపపుణ్యఫల మిచ్చేవి కాగలవు. ఈధర్మసూక్ష్మము మనశాస్త్రములందు పెక్కుతావుల నుదహరింపబడినది. దీనిని దృష్టాంతీకరించుటకే దేవతలయందూ మానవులయందున్నూ కామప్రవృత్తులు కల్పింప బడ్డవి. మహాభారతము గీతలయందలి ధర్మసూక్ష్మములకు విపులవ్యాఖ్యానము. నైసర్గికము, ఆసక్తిశూన్యము, పుణ్య పాపరహితము నగు దైహికకర్మయే వేదవ్యాసునిపుట్టుకకు హేతువు. అట్టిమహనీయుడు పుట్టడముకోసమే ఋషిసత్తముడగు పరాశరునికి మత్స్యగంధిసంపర్కము సంభవించెను, అదీ క్షణికము. ఇట్లే భరతుడు, శకుంతల, కార్తికేయుడును జనించుటకు ధుష్యంతుడు, విశ్వామిత్రుడు, శంకరుడు మొదలగు మహాత్ముల చిత్తములందు కామము క్షణికావిర్భావమొంది