పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93 పాశవప్రేమ

వలపుగొనకున్న మనకామ ముద్దీప్తము కానేరదు. నిసర్గ ప్రేమవలె నది నిరాకాంక్షము కానేరదు. విషయవ్యాపారము సర్వజంతువులకు సామాన్యము కావున దీనిని "పాశవప్రేమ" అందాము.

ప్రేమకు కామానురాగమునకూ మరో తేడా ఉంది. సతి పతిగౌరవ పరిపూర్ణ, వేరొకవ్యక్తియందు సతి చిత్తము ప్రసరింపనోపదు. వ్రజబాలికలకు శ్రీకృష్ణునితో సమగౌరవ భాజనుడు లేనట్లే సతికి పతితుల్యు డుండడు.

తల్లికి సంతానముపై ప్రేమ అత్యధికము, తల్లియూ సంతానమున కమితప్రేమగౌరవభాజనము. కావున నిసర్గప్రేమ మహత్వజ్ఞానపూరితము. అసమానపదస్థులయెడ ప్రేమ జనింపబోదని కొంద రందురు, కాని ఆది సరికాదు. సేవకుడు ప్రభువును, ప్రభువు సేవకుని ప్రేమించడము లేదా? గురువు శిష్యుని శిష్యుడు గురువుని ప్రేమింపగూడదా? పదవియందలి నిమ్నోన్నతములు ప్రేమోదయమునకు బాధాకరములు కాజాలవు. ప్రేయసులకు ప్రేమపాత్ర మత్యంతప్రియము, వారికి దానియం దాదరము మెండు. ఒరు లేలాగైనా దాని నధ:కరింపనెంచితే వారు సహింపజాలక ఆవస్తువును పెద్ద జేసి "దీనికి సరియేది?" అని వాదింతురు, అది వారికి కొంగుబంగారము; పరుసవేదివలె ప్రేమ తానుసోకినదాని నెల్ల పసిడిగా పరిణమింపజేయును.

కామానురాగము స్వతంత్రవ్యవహర్త; వాస్తవిక