పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92 సాహిత్య మీమాంస

నెక్కువగా పిల్లల ప్రేమింతురు. పసితనమందే పరుసకొసంగబడి అత్తవారిల్లు చొచ్చినప్పటినుండీ పతిప్రేమ నపేక్షించుట సతీధర్మము, కాదు.పతి తన్నెప్పుడు ప్రేమించునో, అప్పుడు తా నాతని ప్రేమింపవలయుననీ సతి యెన్నటికి తలపరాదు. పెళ్ళియైనప్పటినుండీ పతిని ఆదరిస్తూ ఆతడే తనకు సర్వమని యెంచి త్రికరణశుద్ధిగా నాతని ప్రేమిస్తూండవలెను. పెళ్ళియాడిన వానినేప్రేమించుట (Love whom you marry) ఆర్య సతీధర్మముకాని, ప్రేమించినవానిని పెండ్లియాడుట(Marry whom you love) కాదు. సతికి జీవితసర్వస్వము పతియే. అట్లామె భావిస్తే పతియూ ఆమెను ప్రేమించితీరును. అతడున్నూ పెండ్లినాటినుండీ ఆమె తన్ను ప్రేమించునను ప్రతీక్షలేకనే ఆమెయం దనురక్తుడై యుండును. ధర్మ మాచరించునెడ నిద్దరూ సమభాగినులు కనుక సతి "సహధర్మిణి" అనిపించుకొనును. "ధర్మపత్ని", "అర్ధాంగి" అను పదములు సార్థకములగునంత సాంద్రసంబంధము పాశ్చాత్యదంపతులలో గానరాదు. వారి దాంపత్యము చిరకాలికము కావలె ననే నిర్భంధము లేదు; పాశ్చాత్యదాంపత్యసంప్రదాయము ననువర్తించువారియం దట్టిప్రేమయే అవతరించుచుండును.

ఆర్యదాంపత్యప్రేమ వినిమయ విహీనము, ఆకాంక్షా రహితమనియు, కామానురాగ మందుకు విపరీతమనియు చెప్పియుంటిమి. వినిమయప్రతీక్షచేతనే పశుపక్షిగణములో ప్రేమ జనిస్తుంది. కామానురాగము పరముఖాపేక్షి, ఇతరులు మనపై