పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

91 పాశవప్రేమ

తాము సుఖింపనెంచనట్టి వారికి ఆకాంక్ష యెక్కడిది?

సతీప్రేమ వ్యవసాయము కాదు కావున మారుకోరదు. "నీవు నన్ను ప్రేమించిన, నేను నిన్ను ప్రేమింతు" ననేది కాదు, ఇచ్చిపుచ్చుకోవడ మందుండదు, వినిమయవ్యాపారము కానరాదు. లతలను, వృక్షములను, పశుపక్ష్యాదికమును సోదరభావమున ప్రేమించిన శకుంతల బదులుకోరెనా? పతిప్రేమానుసారము ప్రశంసనీయము, పతి తనయెడ ప్రేమ జూపెనా పత్ని ధన్యయే; కాని పతిప్రేమ నాసించియే పత్ని పతిని ప్రేమింపనెంచితే అది నిసర్గప్రేమ కానేరదు. పరస్పర ప్రేమ సమకూడినదా మణికాంచన సంయోగమయినట్లు, కింశుకమున సౌరభము వెలసినట్లు, చంపకము శూన్యకంటకమయినట్లు, చందనతరువు పుష్పించినట్లు, చెరకు పండినట్లున్నూ రాణించును. ఇట్లు జరుగకున్నా సతి పతిని ప్రేమింపకతీరదు : _

సతీలక్షణము నొకకవి యిట్లు వర్ణంచెను : _

           *[1] నీవు నన్ను ప్రేమింతు వటంచును, నేను నిన్ను ప్రేమింతునొకో?
             నిన్ను వీడి యెన్నను నే నన్యుని, నియమమిద్ది సతి నే నౌటన్

వాత్సల్యప్రేమలాగ దంపతీప్రేమకూడా ని:స్వార్థము కావలెను. పసిపాపలు పెద్దవారై తమ్ము సంరంక్షు రనియా తలిదండ్రులు వారి నాబాల్యము అతిగారాబముతో పెంతురు? వారి కపత్యప్రేమప్రతీక్షయే యుండదు, ఐనా ప్రాణములకన్న

  1. * ప్రేమ్ తుమ్‌హారే కర్నేహీనే మై భీ కహో కరూంగీ ప్రేమ్? యుమ్‌హే ఛోడ్క-ర్ ఔర్ న జానూం యహీ హై మేరా నేమ్.