పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90 సాహిత్య మీమాంస

శాసించెను. మనువేకాదు మహాభారతాది ఆర్యగ్రంథము లెల్ల ఇట్లే ఉపదేశిస్తూన్నవి.

కామానురాగము ప్రేమవలె ఉన్నతదశ నొంద జాలదు. అది గుణరూపముల ననుసరించి యుండును, గుణములు దోషమిశ్రితములు కాకయుండవు, రూపము కాలక్రమమున కడచనును,

ఇదిగాక రూపగుణముల తారతమ్య మస్థిరము, నేడు నచ్చిన రూపమూ గుణమూ రేపు నచ్చవు. కావున తత్పాత్రములు కాలవశమున అపాత్రములగును.

మరియు రూపగుణసంపద నొకరి నొకరు మింతురు, కావున కామమునకు కడలేదు.

ఈ మూడు కారణములచేతనూ కామానురాగమెల్లప్పడూ ఏకపాత్రనిక్షిప్తము కాజాలదు. అతిచంచల మగుటచే దానికి స్థాయీభావ మలవడదు.

ప్రేమకు సహజధర్మము స్థాయీభావము; అది ఏక నిష్ఠము, నిశ్చలము; గుణములు జూచి కూడరాదు, దోషములు గాంచి తొలగిపోదు. అందువల్లనే ఆర్యసతీప్రేమ అత్యంతానురాగపూరితము, స్థిరము, నిశ్చలము, ఏకనిష్ఠము నగును; కామాంధుల అనురాగము కాలానుగుణముగా మారుచుండును.

నిస్స్వార్థమగుటచే నిసర్గప్రేమ ఆకాంక్షారహితమగును. దోషగుణముల నపేక్షింపక, ఇతరుల మూలమున