పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

89 పాశవప్రేమ

కున్నూ కావలసినంత భేదమున్నది. పతిని సుఖపెట్టి తాను సుఖింప సమకట్టు; ఇల్లాలు సతి. వాత్సల్యప్రేమకూ సతీ ప్రేమకూ లక్షణమొకటే. సంతానమును సుఖపెట్టి పితరులు తాము సుఖింప జూచునట్లు పతియెడ సతి అనురక్త అవుతుంది. నిసర్గప్రేమస్వసుఖాభిలాషి కానేకాదు. ప్రణయభాజనమగు ఇతరవ్యక్తి సుఖమే దానికి పరమాపేక్షణీయము. ప్రేమ అట్టి సుఖమునే కాంక్షించుచుండును.

కామానురాగమం దిట్టి ధర్మదృష్టి కానరాదు. అ దెప్పుడూ ఇతరుల ద్వారా తాను సుఖింప సమకట్టును. ఇంద్రియ లాలస పరితృప్తి నొందగానే కామము చరితార్థమగును. ప్రేమ స్వసుఖనిఒరభిలాషి, పరార్థకాంక్షి; కామము కేవల స్వార్థకాంక్షి, పరసుఖపరాఙ్ముఖి.

ప్రేమ పరార్థపర మవుటచేతనే సతి పతియందు గుణదోషములు పరికింపదు; గుణములగాంచి ప్రేమించువారు దోషములగాంచి ద్వేషింతురు. దోషము లందరియందున్నూ తోచును, కావున రూపగుణనివిష్టమగు అనురాగము స్థిరము కానే కాదు. నిసర్గప్రేమ గుణదోషపక్షపాతి కాదు. తల్లి దండ్రులు తమ సంతానమునందలి గుణదోషములు తడవక వారి నాదరించి ప్రేమించునట్లు సతియు తనపతి యెట్టి వాడైనా వానినే ప్రేమించును. ఇట్టి గుణదోషపక్షపాత రాహిత్యమే సతీప్రేమ కాదర్శము. కనుకనే "పతి యెంత దోషకలితుడైనా సతికి పరమ పూజ్యు" డని మనువు