పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

87 దివ్యప్రేమ

సీత పతిప్రేమ అత్యుజ్వలము కావున అందు దేవభక్తి దాగియుంది; రాధ భగవత్ప్రేమ ఉజ్వలమగుటచే పార్థివమగు పతిప్రేమ అందు లీనమైంది; పతిప్రేమయే భగవత్ప్రేమగా పరిణమించింది, కావుననే రాధయొక్కభక్తి "ప్రేమభక్తి" అనిపించుకొంటుంది. ఇట్టి ప్రేమపరిణితియే ఆర్యసాహిత్యమున గాంచనగును. ఒక్క సాహిత్యముననే కాదు, ఆర్యసంఘమున కూడా ఇట్టి ప్రక్రియ తోచుచుండును. వైధవ్య మొందిన ఆర్యసతికి జగత్పతియే పతి, కావున ఆమె పతిభక్తియూ దాంపత్యప్రేమయూ సహజముగా భగవద్భక్తిలో పరిణమించవలెను. అట్టివా రార్యసంఘమందలి రీతినీతుల ననుసరించి సువాసినులభంగి పతిభక్తి నాచరిస్తూ తన్మూలమున దైవభక్తి నభ్యసింతురు. భగవంతునే పతిగా మదిలో నిల్పి, ఆతనినే ప్రణయభాజనునిగా నెంచి సేవిస్తూ, సతీధర్మము నాచరింతురు. అనురాగ మంతా భగవంతునియందు నిక్షిప్తము చేసి వా రాచరించే భక్తి పతిభక్తియు జగత్పతిభక్తియు నగును. అట్టివారు పతినారాధించవలెనంటే భగవంతునారాధింపవలయును. పతి జీవించియున్నప్పుడే రాధ అతడు భగవంతుడని తలంచిన తీరున, వీరు పతి గతించినవెన్క భగవంతుడే పతియని తలంచవలయును. రాధాపతి జననమరణ రహితుడు జగత్పతియు కావున పతి లేనివారు అతనినే పతిగా భావింపవలయును.