పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83 దివ్యప్రేమ

అందుచేత అసలే గిట్టవు. ఇట్టి దృష్టాంతము లిప్పుడిప్పుడు కాన్పించుచున్నవి. ఇవి ప్రబలకపూర్వమే పాశ్చా త్యవిదాఫణితి మన వారికి ప్రమాదజనకమని యెరుంగుట మేలు. బోధనకును ఆచరణమునకును సానుకూలత లేనందున విద్యాభ్యాసము విఫలమగును; ఎద్దు ఎండకూ పోతునీడకూ లాగితే బండి నడుచుటెట్లు?

ప్రాచీనభారతవర్షమున స్వేచ్ఛాచరణము

యూరోపీయ సంఘములందు ప్రస్తుతమున బరగుచున్న సతీలక్షణములు సభ్యతాప్రాథమికావస్థయందు అన్ని సంఘములందూ ఉండెను. ప్రాచీనభరతఖండమున అచ్చటచ్చట ఇట్టి ఆచారవ్యవహారములు ప్రబలియుండెనని తలంచుటకు నిదర్శనములు కానవస్తూన్నవి - దిగ్విజయ సందర్భమున సహదేవుడు ప్రాచీన మాహిష్మతీ నగరమున కేగినప్పుడు అచటి స్త్రీలు వుంశ్చలులై స్వేచ్ఛావిహారము సల్పుచుండి రట.

"పూర్వకాలమున మనదేశమున స్త్రీలకు అంత:పుర నిర్బంధము (ఘోషా) లేక వారు ఇచ్ఛానుసారము వర్తించు చుండిరి. ఒకరి యధీనమున కాలక్షేపము సేయు నక్కర వారికి లేకుండెను - విషయవ్యాపారములందు తిర్యగ్జంతువుల లీల వారు విహరించుచుండిరి. ఉత్తరకురుభూములందలి వారిప్పటికిని ఆ రీతినే వర్తించుచున్నా" రని పాండురాజు కుంతితో చెప్పెను.

పిమ్మట శ్వేతకేతు వృత్తాంతమును స్త్రీలకు తిర్యగ్జం