పుట:SaakshiPartIII.djvu/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిట్టిగారెలు రాగభోగాదులు పవళింపుఁగైంకర్యములు శ్రీపుష్చయోగములు సేవాకాలములు వైష్ణవ మతమున కక్కఱకువచ్చును గాని పరమార్ద నిశ్చయమున కక్కఱకు వచ్చునటోయి.

పదము
దాసురాల రా రమ్మడియేన్ దాసీ నను మనిరే,
భాసురాంగితిరుమంత్రము చెప్పెద పఠన సేయుమనిరే || గోవిందా ||
ముద్రధారణముచేసెద మని పెద్దముసుఁగువైచినారే
ముసుఁగులోననా. హే హే హే!

ఏలాగు? ఆమాత్రపు రక్తి లేకపోయిన తరువాత మత మెందులకోయి? ఏడువను, మొత్తుకొనను! మా శిష్యురాండ్రలోఁ బుణ్యస్త్రీ వితంతు భేదము లేదు.

వితంతుత్వసువాసినీత్వములు బహిరాగతములు కాని వస్తుతత్త్వమున నున్నవి కావు. ఒక్క స్త్రీత్వమే అచ్చాణియైన స్త్రీత్వమే—కమ్మి కలితి లేని స్త్రీత్వమే-స్వయంభువైన తత్త్వము. జ్ఞానులమైన మనకుఁ జేతాళములు పనికిరావు. అందుచేత మనము “సర్వం ఖల్విదంబ్రహ్మం' న్యాయముచేత

అంతటితో నాగవయ్యా! దిక్కుమాలినదోరణిలోఁ బడిపోవుచున్నావు. పురుషప్రయ త్నము పూర్తిగ లేదని చెప్పినావు. ఆసంగతి నిర్ధారణచేయగలవా! వెఱ్ఱధోరణిలోఁ దిరుగబడి బోకుండ నిదానముగ–

ఉండు-అయ్యో-ఉండు మనఁగాను—' అద్వైతశాస్త్ర ప్రవీణుఁ డైనట్టి ముష్టి చిట్టివీర య్యశాస్త్రిగారికి వెఱ్ఱధోరణి పూర్తిగా నశించినది. ఇంక బదునైదుదినములలో వైద్యశాల నుండి యాతండు పోవచ్చును' అని డాక్టరుగాడు మనకిచ్చిన యోగ్యతాపత్ర మాగోడమీద నున్నది. చూచుకో. ఈడాక్టరు గాడిదె కిప్పడు తలతిక్క తీఱినది. నాకు మతిపోలేదు. నాకేవిధమైన జబ్బు లేదురా. నన్ను బాధ పెట్టకురా యని పదునాల్గు సంవత్సరముల నుండి చిలుకకుఁ జెప్పినటు చెప్పచుంటినే వీడు నామాట లక్ష్యపెట్టినాడా! ఉహు! పిచ్చియాసు పత్రి యనంగా, సిచ్చివారి రోగమును కుదుర్చు నాసుపత్రియని యర్ధము కాదు. పిచ్చిడాక్టర్లు గలయాసుపత్రి యని యర్ధము. వా డిచ్చిన యోగ్యతాపత్రమును జూచి నే నేమంటనో యెఱుంగుదువా? నాకుం బిచ్చి లేదని నీవు చెప్పటచేత నీకుఁ బిఛ్చిలేదన్నమాట నామూల మున సిద్ధాంతపడినది. కావునం బిచ్చిడాక్టరు లుండవలసిన వైద్యశాలలో నీవుండ నేల? మన మిద్దఱము కలసియే యావలికిఁ పోదము రమ్మని యంటిని.

"నాకీ సోదె ఏమియు నక్కఱలేదు. పురుషప్రయత్నమునుగూర్చి చెప్పదువా లేదా " యని యంటని.

నన్ను బెదరింతువా? Nonsense, డాక్టరు ముండకొడుకు కొరడాదెబ్బలకు లక్ష్యపె ట్టుని వీరాగ్రేసరుడ నని యెఱుంగవా? ఆపనికి మాలినవాని యోగ్యతాపత్రమును నేను ' గౌరవింతునా? నే నిక్కడనే యుందును. నన్ను వా డేమిచేయునో చూతును. ఈనడుమ నొక్కయత్యంత చిత్రమైన యంశము జరిగినది సుమా.

“నీవిచిత్రాంశము నాకక్కఱలేదు. పురుషప్రయత్నమునుగూర్చి చెప్పదువా పోవు దునా " యని యడిగితిని.