పుట:SaakshiPartIII.djvu/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లక్ష్యం చెప్పగానే సహకరించి, వ్యాసాలన్నిటికి 'క్లుప్త కథనాన్ని' వ్రాసి యిచ్చిన మిత్రులు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు. మా ప్రచురణ సంకల్పం తెలిపిన వెంటనే ఆనందంతో ఆశీర్వదించి పీఠిక వ్రాసి యిచ్చినవారు మహాకవి, కళా ప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు, ఇటువంటి ఆదరాభిమానాలతోనే ఈ సంపుటాలకు ముఖపత్ర రచన చేసినవారు ప్రముఖ చిత్రకారులు శ్రీబాపుగారు. ఈ సంపుటాలు అందంగా - అచ్చుతప్పులు లేకుండా - పాఠకులకు అందించాలని ఆశించి, శ్రమించి సహకరించిన వారు పండిత మిత్రులు పి.జగన్నాధరావుగారు. వీరికి మా 'హార్ద' కృతజ్ఞతులు.

ఇన్నాళ్లకు మళ్లీ 'సాక్షి' వ్యాసాలను వెలువరించమంటే, చాలా అందంగా చెయ్యాలని ఆత్యాధునిక ముద్రణ పద్ధతిని అనుసరించాం. ఇది బరువైనదైనా 'పరువైనదని' సాహసించాం. ఈ సంపుటాలను మీ చేతిలో సవినయంగా సగౌరవంగా ఉంచుతున్నాం. ప్రోత్సహించి, ఆశీర్వదించమని విన్నవించుకొంటున్నాం.

"సాక్షి మూడు సంపుటాల వ్యాసాల సాక్షిగా"

"తెలుగు సాహిత్యానికి సాక్షి నామసంవత్సరం"

డైరెక్టర్ ఆఫ్ పబ్లిషింగ్

అభినందన పబ్లిషర్స్

బి.బాబ్జి

డైరెక్టర్