పుట:SaakshiPartIII.djvu/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యన్నమాట లేదు. శాశ్వతముగా నుండువాఁడు దానొక్కడే కాని మిగిలినవా రందరు నశించువారే యని నమ్మికతోఁ దా నుండును. అట్టివాఁ డొకని నాశ్రయింపఁగలడా? అతనికున్న గర్వము నహంభావము రణశూరుల కున్నదా? రాజాధిరాజులకున్నదా? తలతిక్కలో నంతవాఁడు మఱియొక్క డేఁడి? తనరుచియే తనది; తన మతమే తనది; తన ధోరణియే తనది. ఫాదుషాను మెచ్చువాఁడు కాఁడు. భగవంతునే మెచ్చువాఁడు కాఁడు. కాని యిట్టికొస వెర్రివారివలననే భాషాభివృద్దియయినది; యగుచున్నది. కావలసియున్నది. వారిండ్లలోబడి యష్టకష్టములఁ బడుచు భాషా సేవ చేయుచున్నారు. వారంత దురవస్థలో నున్నారని చెప్పటయే సత్యము. వీథుల వెంటదల లెత్తుకొని తిరుగుచునే యున్నారని మీరు నన్నధిక్షేపింపకుఁడు. వా రంటుజవాను లే వైపుననుండి వచ్చుచున్నారో యని యటునిటు తలలెత్తి చూచుచున్నారు. కాని మరియొకటి కాదు. నామాట యథార్డమని విశ్వసింపుఁడు. అట్టివారు కొన్ని యమూల్య గ్రంథములను వ్రాసి యంతరించినారు. ఇంక నంతరింప నున్నారు. వారి గ్రంథము లచ్చుపడుట కాధారము లేదు. అవి భాషలోఁ జేరు ననునాస లేదు. ప్రతిమండలమందుఁ బుస్తకముల యేజంటులు నున్నారుకదా! వా రాగ్రంథ ముల నుద్దరించి కవులకష్టములఁ గడతేర్పం ఎ? ఆ కడతేర్చుచునే యున్నారు. కవులను గ్రంథములనుగూడ నూటి కెనుబదియైదు కమీష ననువాఁడొకఁడు మూఁడువేలప్రతు లచ్చువేయించుకొని మూడుపాతికల ప్రతులు కవికిచ్చెద ననువాఁడొకఁడు. ఇట్టివారే యున్న వారిలో ననేకులు. ఇతర దేశములలోఁ బూర్వశతాబ్దములందలి గ్రంథవిక్రేతలు కవులనైన మిగిల్చిరి. ఇప్పడు పరదేశములలో గ్రంథకర్తలు గ్రంథవిక్రేతలుగూడ బాగుపడు చున్నారు. మనదేశమందు గ్రంథవిక్రేతలు కలియుగవృకోదరులై మన గ్రంథకర్తలనుగూడ గబళించుచున్నారు. గ్రంథకర్తలలో బొత్తిగారిక్తులగువారిని మీరు కాపాడ వలసియున్నది. ధనశక్తి తక్కువైన కొలఁదిఁ గవితాశక్తి యొక్కువగ నున్నవా రెందరో యున్నారు. ఆ సంగతి మీరు బాగుగఁ దెలిసికొని యట్టివారి గ్రంథముల నచ్చువేయించి వారికి గ్రంథప్రతుల నిచ్చునెడల వారు బాగుపడుదురు. వానిని గ్రంథనిర్ధాయకసంఘమువారు పఠన గ్రంథములుగ నియమించునెడల వారు రవంత నిలువఁబడి యింకను గ్రంథముల వ్రాయుదురు. పరిషద్ద నములోఁ బండ్రెండవవంతో యెనిమిదవవంతో యొకందులకు వినియోగింపవలసి యున్న దని నే నింతకుముందుఁ జెప్పితినే, యీ యుత్తమకార్యమునకైయది వినియోగపడవలసియు న్నది. ప్రపంచమందలి యితరదేశములలోని పరిషత్తులు దాదాపుగా నన్నియు నిట్టు నిరుపేదకవులకు సాయమొనర్చినవి. అదికాక యట్టివారు మరణించినపిమ్మటఁ గూడ వారిపిల్లలకుఁ గొంతయుపకార వేతనము లిచ్చినవి. అంతపని మనము చేయ జాలము. ప్రధానకృత్యములకే పరిషత్తుధనము లేకుండ బాధపడుచుండఁగాఁ బారమార్షికకృత్యము లెట్లు చేయఁగలదు? అదిగాక రెండు మూఁడు వందలసంవత్సరములక్రిందటఁ బాశ్చాత్యదే శములందలి కవుల దరిద్రతవంటిది ప్రపంచమున లేదు. మనకవులలోఁ గూడ లేనివారనేకు లున్నారు. కాని వారియంత లేనివారు కారు. అయిదుదినము లాంకలిచే మాండిమాండి యాకస్మికముగ దొరికిన రొఫై నాత్రముతో మ్రింగఁబోవ నది యంగిటి కడ్డుపడుటచే నంతలో ననువులను బాసిన ఓట్వే (Otway) వంటి కవి మనలో నేఁడీ తనయస్థిపంజరము నమ్ముకొని రొఫైవాని కీయవలసిన ఋణమును దీర్పు మని మరణశావసము వ్రాసిన వాజిలాల్ వంటికవి మనలో నేఁడీ? కావున మనకవులకు గ్రాసవాసముల కంతసాహాయ్య