పుట:SaakshiPartIII.djvu/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాసి కాలగతిం జెందినారు. వారిచరిత్రములు తెలిసినంతవఱకు సంపాదింప వలసియున్నది. ఈభారముకూడ బరిషత్తు వారే భరించుట కర్డులు. కందుకూరి వీరేశలింగము పంతులు గారి కవి జీవితగ్రంథముల తరువాత వ్రాయదగిన గ్రంథముల కుపయోగపడు సామగ్రి పరిషత్తువారికిఁ గావలదా? అదిగాక మృతకవులయందఱ ఛాయాపటములఁ గూడఁ బరిష త్కార్యాలయమున నుంచుట మంచిది. వారి నావిధముగ మనము గౌరవింపవలయును.

ధనార్జనము:-కాని ప్రాబలుకులకుఁ బ్రణవ మెట్లు ప్రారంభమో, వివాహాదిశుభకార్య ములకు విఘ్నేశ్వరపూజ యెట్టు ప్రారంభమో, నాటకములకు నాందీపూజ యెట్లారంభమో, పరిషత్కార్య నిర్వహణమునకు “సొమ్ములేదు సొమ్ములే! దను పంచాక్షరి ప్రారంభమై యున్నది. ఇది యొక్క మనపరిషత్తునకుఁ గలిగినబాధయే కాదు, పార్లమెంటుసభ యందు మొదలు పంచాయతీకోర్టులోవఱకుఁ బాడబడుచున్న పాటలన్నిటికిఁ బల్లవి యిదియే. సొమ్ములేదు. సరియే కాని, యుత్సాహము లేకున్నఁ జిక్కు కాని సొమ్ము లేకున్న నంత చిక్కు లేదు. సొమ్ముపై నుండి రావలసినది, యుత్సాహము లోనినుండి రావలసినది. ఉత్సాహమె మనకు బూర్తిగ నున్నయెడల సొమ్ము వచ్చియే తీరును. ఉపకారవేతనమును దీసికొనక పూర్వము మ.రా.శ్రీ, జ. రామయ్య పంతులుగారు పరిషత్తునకు ధనలోప మెక్కువగా నుండుటను జింతించి తా మాంధ్రదేశమున నున్న ప్రతిగ్రామమునకే గాక ప్రత్యాంధ్రుని గృహమునకుఁ గూడఁ దిరుగుదు ననియు నింటికొక్క రూపాయచొప్పన సేకరించి పరిషత్తున కీకొఱత దీర్తు ననియు నీగ్రామమందే సెలవిచ్చియుండిరి. ఆయన యుత్సాహమే పరిషత్తునకున్న ప్రధానాధారములలో నొక్కటి. ఆయన పెద్దలగుచున్నారు. యువకులగు భాషాభక్తులాయనకుఁ దోడుపడినయెడల సొమ్ము లేదన్న పంచాక్షరీమంత్రము సొమ్ము లేకపోలేదను నష్టాక్షరీమంత్రము క్రింద మార్పఁగలరు. మహారాజులు రాజులు జమీం దారులు మొదలగునంపన్ను లిదివఱకే విశేషధన మిచ్చియున్నారు. అందులో మామహారాజు గారు పైగ ప్రధానమైన నిఘంటు నిర్మాణమునకు వలయుధనము నంతయు నీయసంకల్పిం చుకొనియే యున్నారు. ప్రజలే తమ బాహుబలమున నింకఁ బరిషత్తునకు ధనము సమకూర్ప వలసియున్నది. ఊరనున్న ప్రతి గృహముపై యూనియను పంచాయితీ పన్నిచ్చుచు న్నామా? లేదా? ఒక్కరూపాయ మొదలు పది యిరువది రూపాయలకు పైగ నిచ్చుచు న్నామా? లేదా? పరిషత్తు పన్నుక్రింద నింటింటి కొక్కరూపాయ యింతటి నుండి వసూలు కావలయును. అది యెంతబీదవారి యింటికైనను భారమని యనిపింపదు. ఇదివఱకు మన మెన్నిపన్ను లిచ్చుచుండలేదు. ఇంక నెన్ని యిచ్చుటకు సంసిద్దులమై యుండలేదు. అవియన్నియు మనకు మోక్షప్రదములా? ఇది కాకపోవునా? నిజ మాలోచింపఁగాఁ బరిషత్తుప న్నుకంటె మ్యునిసిపల్ పన్ను మనకు ముఖ్యమైనది కాదు. ఇంటిముందు పెంట యుండుట మంచిదా? మనసునందుఁ బెంటయుండుట మంచిదా? కావునం బంచాయితీపన్ను కంటెఁ బదిరెట్లు సంతోషముతోఁ బరిషత్తుపన్నును మన మీయవలయును. ఇప్పడు మనదేశమం దున్న గ్రంథకర్తలతాతలో తాతలతండ్రులో ప్రత్యాంధ్రునియింటిలో జరిగిన వివాహములలోఁ గవిత్వపు బఖైరమును గ్రహించినవారైయుందురు. నేనుగూడంగవిత్వపువరహా గ్రహించు నాచారము గల వారివంశములోని వాఁడను.

కవులారా! మనహక్కులను మనము విడుచుకొంటిమి. అది తప్ప. Lispendens