పుట:SaakshiPartIII.djvu/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడియున్నవి. భాషకీమహోపకారము కూడ మామహారాజుగారే యాచరించు చున్నారు. ఇది కాక కవిచక్రవర్తియైన కృష్ణదేవరాయలచే రచింయుంపఁబడిన యాముక్తమాల్య దకు మామహారాజుగారు బ్రహ్మశ్రీ మహామహోపాధ్యాయే త్యాదిబిరుదాంకితు లయిన వేదము వేంకట రాయశాస్రులవారిచే వ్యాఖ్యానము వ్రాయించిరి. దాని నచ్చువేయించుట కెన్ని సంవత్సరముల క్రిందటనో యేర్పాటు చేసియుండిరి. వ్యాఖ్యారచన పూర్తియైనదట! అచ్చింక గాలేదు. కారణము తెలియదు. ఇదిగాక యాస్థానతర్కవిద్వాంసు లగు శ్రీమాన్ గుదిమళ్లవేంకట రంగాచార్యుల వారిచే శ్రీవచనభూషణ మనుసంస్కృతగ్రంథము నాంద్రీ కరింపఁజేసిరి. ఇట్లు భాషాపోషకులు భాషాపండితులు నగు శ్రీమహారాజుగారికి దీర్ఘాయురా రోగ్యాది సకలైశ్వర్యములు సర్వేశ్వరుఁడు ప్రసాదింపవలయు నని పరిషత్పక్షమున నేను బ్రార్థించుచున్నాఁడను.

వ్యాకరణము:- ప్రస్తుతవ్యాకరణము లసమగ్రముగ నుండుటచేత భాషాపరిశుద్ది రక్షణ మునకై విపుల మగునొక వ్యాకరణమును రచియించుట మంచిదని పూర్వసభలలో నుపన్య సించిన యధ్యకులు కొందరు సెలవిచ్చిరి. వారియిష్టము ననుసరించి వ్రాసినను వ్రాయవచ్చును. మీయుపేక్షననుసరించి మానినను మానవచ్చును. ప్రపంచమున నున్న ప్రతిసారస్వ తపరిషత్తునకు రెండే ప్రధానోద్దేశములు. భాషాపోషణము, భాషాపరిశుద్దరక్షణము. మొదటిది గ్రంథములవలన నగును. రెండవది వ్యాకరణశాస్త్రమువలన నగును. ఇదివఱకు మన మనుకొనిన ట్టింక, గొన్నివత్సరములు గ్రంథములు వృద్దినొందినతరువాత వ్యాకరణరచనా నుచరణనుగూర్చి యోజింపవచ్చును. ఇప్ప డంత తొందరలేదు. ఇప్పడే రచియింపవ లయునని యోజించు వారు వారి యిష్టానుసార మాచరింపవచ్చును. ఎప్పడు రచియించినను బరిషత్పకముననే యది రచియింపఁబడుట మంచిది. పరిషన్ముద్ర దానిపైఁగూడ నుండవల యును.

మహాజనులారా! ప్రభువుల యాదరణ మున్నను లేకున్నను బ్రదుకుఁదెరు వున్నను లేకున్నను బ్రపంచయాత్రలోఁ బరిపరివిధములఁ గష్ట్రములొందినను భాషాచరిత్రమునఁ దమ పేరు స్థిరముగా నిలిచియుండునను ప్రజలశ్వాసముచేత నూరుసంవత్సరములలోపల నెందఱోగ్రంథములు రచియించి మరణించి యున్నారు. తమహృదయరక్తముతో వ్రాసివారు మనకొఱ కిక్కడ విడిచిపెట్టిన గ్రంథములను మనము భద్రపరిచి గౌరవించుచున్నామో లేదో యని వారి నిశ్శరీరాత్మ లాందోళనము నొందుచున్నవి. తమ్ముఁ గూర్చి తమతరువా తివా రేమనుకొనుచున్నారో యనియుఁ దమ్ముఁ బ్రశంసించుచున్నారో దూషించుచు న్నారో మలచియే పోయినారో యనియు వారు తహతహలాడుచున్నారు. నిజము చెప్పవలసి నయెడల మనము కొందరి నప్పడే మఱచియే పోవుచున్నాము. మండపాక పార్వతీశ్వరశా స్రులవారు రచియించిన గ్రంథనామము లన్నియు మనకుఁ దెలియునా? ఆయన జననతిథి మృతతిథి యేవో మనకుఁ దెలియునా? పోనిం డెంతకాలము జీవించిరో యెఱుఁగుదుమా? శతాధిక గ్రంథకర్తచరిత్రమే మనకు సందేహాస్పద మైనదే. వావిలాల వాసుదేవశాస్రులవారు, బెల్లపుకొండ రామారావుగారు, కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు, ధర్మవరము కృష్ణమాచార్యులుగారు, డి. కృష్ణశాస్రులుగారు, దేవులపల్లి సుబ్బరాయ తమ్మన్నశాస్రుల వారు, దేవగుప్త సన్న్యాసిరాజుగారు. తిరుపతిశాస్రులవారు మొదలగువారెందరో గ్రంథముం