పుట:SaakshiPartIII.djvu/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీసికొనిరావలసిన గ్రంథములేవో మొదట నిర్ణయించుకొన వలయును. వానిలో ముఖ్యములైన గ్రంథము లేవో నిశ్చయించి, మనలోని గ్రంథకర్తల శక్తులన్నియు మనకుఁ దెలియునుగాన, “అయ్యా! యీగ్రంథమును మీరీ గ్రంథమును మీ రని మనలో మనము పంచుకొనవల యును. ఆగ్రంథములు పైపరిషత్సభకుఁ బూర్తిచేసి తీసికొనివచ్చు నేర్పాటు చేసికోవల యును. మహాజనులారా! ఈయేర్పాటుమాత్ర మధ్యక్షోపన్యాసముకంటెఁ గార్యదర్శి సాంవ త్సరికచర్యా నివేదనముకంటెఁ గార్యనిర్వాహకసంఘపుఁ దీర్మానములకంటె నత్యంతము ముఖ్యమైనది. ఏపరిషత్సభలో భాషాపండితులు సంవత్సరము కష్టపడి పూర్తిచేసి తీసికొనివ చ్చిన గ్రంథములు ప్రదర్శింపబడునో యాపరిషత్సభయే జయప్రదముగా జరిగినదని చెప్పవలసినది. మిగిలినసభ లన్నియు మిత్రదర్శనములు బంధు సమాగమములు లీలా ప్రయా ణములు గాలిమార్పులు అట్ హోములు (At home) టీపార్టీలు-ఇన్ని మాటలు చెప్పితివి గదా! నీ వేగ్రంథము నేల రచియింప లేదని మీరు న న్నడుగఁదగినదే. ఇదిగో చెప్పచు న్నాను. నాగుణలోపముకూడఁ జెప్పెదను. ఆంధ్రభాషలో నాయభిప్రాయమును వెల్లడిం చుటకుఁ దగినశక్తి నాకుఁ గలదు కాని సంస్కృతభాషలో నాకుఁ బ్రవేశము తక్కువ. సామాన్యపు దక్కువ కాదు. లేదని చెప్పఁ దగినంత తక్కువ. ఆంగ్లేయభాషాజ్ఞానము మొదటి నుండియుఁ గలత కొట్టయినది. సంవత్సరముల క్రిందటఁ జదివిన యాంగ్లేయగ్రం థమే కాని తరువాతఁ జదివిన దొక్క టైన లేదు. జీవనోపాధిలో నాంగ్లేయ భాషాజ్ఞాన మేమైన నక్కఱవచ్చిన దేమో యనంగ శ్రీరామరక్ష, శ్రీరామరక్ష, మహారాజశ్రీయే కాని మై డియర్ సర్ (My dear Sir) అని యెవరికి వ్రాయవలసిన యావశ్యకత నాయదృష్టమున లేకపోయినది. అందుచే న న్నాంగ్లేయభాష రానివాఁడుగనే మీరు గణింపవలయును. మీ రిట్టు సంవత్సరక్రమముగాఁ జేయవలసిన గ్రంథజాలము వలన భాషయభివృద్ది నొందుటయే కాక గ్రంథకర్తలలో సఖ్యముకూడ నభివృద్ది నొందఁగలదు. "కవికిఁ గవి కున్న కాకోదర మండూకము వైఖరి, కవికి విమర్శకున కున్నమూషకమార్థాలవైఖరి, విమర్శకునకు విమర్శకున కున్న సామజపంచానన పద్దతి, సత్వరముగ నంతరించి వారిలో సాహచర్యము సౌమనస్యము సౌభ్రాతృత్వము సంభవింపఁగలవు. గ్రంథకర్తలలో నిట్టి మనస్థితి భాషకు దేశమునకుఁ బరమ శుభోదర్కము. సాహిత్యపరిషత్పక్షమున నిప్పడు రచియింప బడుచన్న యాంధ్రభాషాశిరో భూషణ మైనగ్రంథము సూర్యరాయాంధ్ర నిఘంటువు. ఇది పరిషత్పకముననే రచియింపఁబ డుచున్నను బరిషత్సభ్యులకు ధనవిషయ మైనశ్రమము లేకుండ నిఘంటుసంబంధము లగుసమస్త వ్యయప్రయాసములను మామహారాజుగారే మహోదారమనస్కులై వహించుచు న్నారు. భాషాపండితులును నుత్తమ విమర్శకులును నగు మ-రా-రా-శ్రీ, జయంతి రామ య్యపంతులుగారు కేవల భాషాప్రేమ పూర్వకశ్రమమునకులోనై భాషా సేవయే ప్రతిఫలముగా నెంచి నిఘంటు సంపాదకత్వమున నిర్నిద్రదీకులైయున్నారు. ఈనిఘంటువు మహోత్తమ గ్రంథము కాఁగల దని నమ్మియున్నాము. మరియు ననేకాంధ్రప్రబంధ వ్యాఖ్యాన రచయిత లును ననేక గ్రంథద్రష్టలును నపారసాహిత్య సంపన్నులును నాస్థాన విద్వాంసులు నగు శ్రీపురాణపండ మల్లయ్యశాస్రులుగారిచే బ్రహ్మసూత్ర భాష్యమును మహారాజుగారే యాంద్రీ కరింపఁజేసిరి. భాషాపుష్టికర మైనదియు విషయగౌరవప్రాశస్త్యాదులం బట్టి యాచంద్రార్క ముగ నాంధ్రభాషలో నుండ దగినదియు నైయున్నది. ఇది కాక యనేక పాఠాంతరములతో నర్హమైన వ్యాఖ్యతో నాంధ్రభారతమందుఁ గొన్నిపర్వము లీపండితవర్యునిచేతనే