పుట:SaakshiPartIII.djvu/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎటువొచ్చెనను వారిని బ్రత్యేకముగ సమావేశ మొనర్చవలసియున్నది. పరిషత్ను బ్రతిసంవత్సర మెవ్వరో యొక రేదో యూరి కాహ్వానించుచున్నారు. మన మెవ్వరినో యధ్యక్షు నేర్పరుచు కొనుచున్నాము. ఏదో కార్యక్రమము ననుసరించి యెట్టులో జరుపుకొనుచు న్నాము. పై సంవత్సరమునకు మరేదో యూరు పోవుచున్నాము. అంతే జరుగుచున్న దంతే. ఇన్నిసంవత్సరములనుండి భాషాభివృద్దికై ప్రయత్నించు చుంటిమి కదా! అది యేతీ రున నైనది? ఎంతవఱ కైనది? వేనివలన నైనది? అని మనము మనలను గఠినముగాఁ బరీక్షించు కొనఁదగదా? ఇతరులు మనల బరీక్షింపకుండ మనమె యల్లొనర్చుకొనట మంచిదికాదా? పదునైదు పదునారు పూర్వప్రబంధము లచ్చువేయించితిమి, పారిభాషికపద ముల పట్టికలు గొన్ని రచియించితిమి, ప్రశస్తములైన యుపన్యాసము లనేకములు పరిషత్పత్రికలోనచ్చు వేయించితిమి. A Defecne of Literary Telugu అను గ్రంథము ప్రకటించితిమి. కాని మనము చేసిన యీ సేవ చాలకపోవుటచేఁ గాఁబోలుఁ బరిషత్క న్యక యుండవలసినట్లు లేదు. పండ్రెండవయేడు జరుగుచున్న పడు చెట్లుండవలసినది? ఓనన్నుఁ జూడు నన్నుఁజూడు మన్నట్లుండ వలసినదే-అట్లున్నదా-అయ్యయ్యో! సంవత్సర ములున్న నావలెనే చప్పిదౌడలతో శల్యావశిష్టమైయున్నట్టున్నదే బంగారము వంటి ప్రాయ మంకురించిన పడుచు పట్ట బగ్గములు లేకుండ నుండవలసినదే. అయ్యో కాలానుసారగ్రంథ పోషణమునఁ గాని కావ్యకన్యక యొడలు చేయదు. రేకెత్తదు. జబ్బపై జబ్బ వేయదు. జగన్మోహకముగఁ గనంబేడదు. ఇదివఱ కెన్నో నాటకములు నవల లున్నవి కదా వానివలన భాషాభివృద్ది కాలేదా యని యందురేమో ఏదో స్వల్పముగ నయియుండును గాని వానివలన భాషలో నూతనాభిప్రాయములు గలిగినవా? నూతనవిషయము లేమైన బోధింపఁ బడినవా? నూతనశబ్దజాల మేమైన భాషలోఁబ్రవేశించినదా? అవియన్నియు మెరుంగులు, జమత్కారములు, విలాసములు, వన్నెలు, వగలు, నొయ్యారములు, తళుకులు, బెళుకులు, అంతేకాని వానివలన భాషయభివృద్ధి నొందిన ఫ్లెట్టు చెప్పఁగలము. ఒకభూగోళశాస్త్రము మనలోనికిఁ దెచ్చుకొన్నయెడల మనవారికిదివఱకుఁ దెలియని విషయము లెన్ని తెలియును? ఇదివఱకు భాషలో లేనియభిప్రాయములిపుడు క్రొత్తగా నెన్ని చేరును? ఇదివఱకు భాషలో లేని యెన్ని శబ్దము లిప్పడు క్రొత్తగాఁ జేరును? లీలావతినాటి గణితముతరువాత మనకట్టి దేదైన నున్నదా? ప్రపంచమున నున్నయన్ని శాస్త్రములలో నన్నికళలలో నన్నితంత్రములలో నేమేమి మెరుఁగు లున్నవో తెలియఁ జేయఁగల గ్రంథములు మనకుఁ గావలయును. ఇతరజాతుల వారందఱట్టు సంపాదించు కొనుచున్నారు. కావున నింతగా దేవులాడవలసివచ్చి నది. ఒక్కొక్కజాతిగ్రంథము భాషాదేవి కొక్కొక్కముందడుగుగా నుండవలెను. అట్టిగ్రంథ ములను సృష్టించుటకు మన మిపు డేమిచేయఁ దగియున్నది? అధ్యక్షకోపన్యాసమైన తరువాత గార్యదర్శిని వేదనమేదో యున్నదికదా! దానితరువాతఁ బండితులయపన్యా సము లున్నవి కదా! ఉపన్యాస బాహుళ్యము కొంత తగ్గించి మొదటి దినమునందు గావి రెండవదినమందు గార్యనిర్వాహకసంఘసభకుఁ బూర్వమో పరమో కాని గ్రంథకర్తలందరుఁ గలియవలయును. కేవలము తెనుగు తెలిసినవారేకాక, సంస్కృతాంగ్లేయ భాషలయందుఁ బ్రవేశ ముండి యాంధ్రమున వ్రాయఁగల గ్రంథకర్తలు కలియవలెను. ఈనంవత్సరమున కేదో జరిగిపోయినది. పైసంవత్సరము నుండి యట్లు చేయుట మంచిదేమో యోజింపుఁడు. అట్లు కలసి యిప్ప డాంగ్లేయమున నుండి సంస్కృతమునుండి యాంధ్రభాషలోనికిఁ