పుట:SaakshiPartIII.djvu/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నున్నదా? అభిప్రాయ ప్రకటనమే కావలసినది. అన్ని నాగరకదేశము లందు గూడవచన ప్రబం ధములు లక్షోపలకలుగా వృద్దిపొందుచున్నప్పడు మనదేశమం దట్టు జరుగకపోవుట కడు శోచనీయముకాదా? వచన గ్రంథరచనాబాహుళ్యమునఁ గాని భాషయభివృద్ది నొందనేరదు. మనపరిపాలకులగు నాంగ్లేయులభాషలో వివిధ విషయములపై నెన్నివేల వచనగ్రంథము లున్నవో మీ రెఱుఁగనివిషయమా? మీరు వానిలో నెన్నింటినో చదివియే యుందురు. చదివి యూరకుండుట తగునా? ఆజ్ఞానము నంతను సంపాదించిన మీరు మనమాతృభాష నభివృద్దిపఱచుటకుఁ దోడుపడనక్కఱలేదా? మన కెంతసేపు నాటకమో, నవలయో, ప్రహసనమో, చిన్నకథయో, మోహగీతమో యంతకంటె మరేమియు లేదే విజయనగర రాజ్యమునుగూర్చి సూయల్ వ్రాసిన గ్రంథమైన మనవా రాంద్రీకరింపకుండి రే! చాణక్యుని యార్దికశాస్త్ర, మెవ్వరైన మనకుఁ దెనుఁగుబాసను నేర్పిరా? ఒక్క గులాబిపువ్వునుగూర్చి యెన్నియాంగ్లగ్రంథములో యున్నవి. మన కొక్క గ్రంథమైన నున్నదా? శారీరశాస్త్ర మొక్కటి సంపూర్తిగాఁ బరివర్తన మొనర్పఁదగి యున్నది కాదా? ఫోటోగ్రాఫీ (Photography) bcó 3beoeệ (Metallurgy) hxš s:Serỹsso (Evolution) hxó xoô దేనిమీఁదనో మరి యింక దేనిమీఁదనో యున్నగ్రంథములలో నుత్తమమైనదానిని మచ్చున కొక్కటియైన మనభాషలోఁ జేర్పంగలవారు మనలోని యాంగ్లేయ విద్యాధికులే కాని మఱి యెవ్వరున్నారు. వారు మన కేమని యూరకుండునపుడు భాషకు: దుర్గతి యెట్టు వదలును. ఆంగ్లేయు లెన్నిపరభాషాగ్రంథములను దమభాష లోనికిఁ దెచ్చుకొనుట లేదు? మన మట్టేల సేయరాదు? అదికాక స్వతంత్ రగ్రంథముల కేమంత ప్రోత్సాహ మున్నది? శృంగారరసమున వ్రాసిన గ్రంథము లసభ్యమసభ్య మని మదరాసులోఁ బఠన గ్రంథనిర్ధాయక సంఘము బరిలో నొక్క-క్రైస్తవుడో మహమ్మదీయుడో వైచినకేక ఛత్రపురపుఁ జవుటపల్దలకుఁ దాఁకి బళ్లారి బోడికొండలమీఁదఁ బ్రతిధ్వనించు నప్పడింకఁ జేయవలసినదేది? కరుణరసమున గ్రంథము వ్రాసినయెడల గజనీమామూదు సోమనాథలింగభంగ మొనరించినది. మొదలు త్రికాలములయందు మనకలవాటున్న రసము కరుణరసమే యగుటచేత నెవ్వరాగ్రంథ మును లక్ష్యపెట్టుదురు? హాస్యరసమున గ్రంథము వ్రాసినయెడల నితరజాతుల కెట్లున్నను మన కది మిగులఁ దప్ప. మనకు లైఫ్ (Life) చాల సీరియన్ (Serious) అని యేదో పుట్టి మునిఁగిపోయినట్టు జీలుగు బెండుకంటె దానిని లఘువుగ జూతురే? వీరరసముపై వ్రాయుటకుఁ జేతులు కదలకుండ నరదండములే యయ్యెను. అందుచేఁ గల్పనకుఁ గవితకు సృష్టికి నవకాశమేది? ఏమున్నదో నే జెప్పవేల? మీరెరుంగనిదియా? అందుచే బ్రతుకుందెరువు పుస్తకములు, ప్రతిదేశ వీరచరిత్రములు, ప్రాణరక్షణ గ్రంథములు, ప్రకృతిశాస్త్రగ్రంథ ములు, రాజనీతిపుస్తకములు, పరిశ్రమగ్రంతములు నింక నిట్టివే భాషలోనికి దింపవలసి యున్నది. గ్రంథజాలము యథార్థమైన సారస్వత మగునాయని సందేహము వలదు. “సమిష్టిస్స ర్వశాస్తాణాం సాహిత్య మితికథ్యతే' యని యున్నదికాదా? సాహిత్యపరిషత్తువారికే యిఁక సందేహమేల? కాలానుసరణమైన సారస్వతమిదియే. ఈపనియాంగ్లేయభాషావిద్వాంసులగు నాంధ్రులవలననే కాని కాదు. వారిలో మాతృభాషయం దాదరమున్నవారు కొందరున్నారు. వారెట్లు న్నారనఁగ ననేకవిషయజ్ఞానసామగ్రి యంతయు సిద్దపరిచి కొనియున్నారు. విషయ విభాగములఁ గూడఁ జేసికొనియున్నారు. తెనుఁగుభాషలో వ్రాయుటకు జంకుచున్నారు. చేతఁగాక కొంత. సిగ్గుచేఁ గొంత. మాకన్నియుఁ దెలియు నని వెల్లడించుచునే యున్నారు.