పుట:SaakshiPartIII.djvu/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇప్పడు మనకట్టి కవితాసంపత్తి యున్నదా? ఉహు. మనచిత్తముల కట్టియుత్సాహమైన నున్నదా? ఉహు. విదేశీయ పరిపాలనమున, విదేశీయ గ్రంథపఠనమున, విదేశీయాచారావలం బనమున, విదేశౌషధ గ్రహణమున మనపూర్వవ్యక్తి పూర్తిగ నశించినది. గంగాదేవి నురుగులోఁ గైలాసేశ్వరుని జటాజూట మావరించిన జనని మందహాసమును మనము గాంచలే నప్పడు మనకుఁ గవిత్వ మెక్కడిది? గరుడుడు కృష్ణా యనునప్పడు • విష్ణువాహ నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః, యని చేతులు జోడించుకొనలేని మనకుఁ గవిత్వ మెక్కడిది? అట్టు చేసిన వానిని బుద్దిహీనుఁడని మనము పిలుచుండినపుడు మన కింకఁ గవిత్వ మెక్కడిది? ఇదికాక మతమును వృద్దిచేయకుండ, దైవభక్తిని హెచ్చింపకుండ, నాధ్యాత్మికజ్ఞానమును బలపరుపకుండం, దైవభక్తిని హెచ్చింపకుండ, నాధ్యాత్మికజ్ఞానమును బలపరుపకుండ బ్రకృతిశాస్త్ర మసందర్భముగ, ననర్హముగ, ననుచితముగఁ బవిత్రప్రదేశ ములందలి పైకప్పలను దొలగించినప్పడు మన కింకఁ బ్రకృతిపై రోఁతయే కాని ప్రీతి యే మున్నది? విసుగే కాని వింత యేమున్నది? అగ్నిజ్వాలలోని యసాధారణ లావణ్య మును జూచి యానందింపలేక యిది చూచి కెమికల్ కాంబినేషన్ (Chemical combination) యొక్క ఫల మని నిర్లక్ష్యముగఁ జేయి నూఁపుచున్నాము. కలకంఠము గానకాలక్షేప మొనర్చ నొడలు జల్లు మనవలసి యుండంగా వోకల్ కార్డ్సు (Vocal chords) యొక్క అరేంజిమెంట్సు (arrangements) ఆతీరున నున్న వని మన పెదవి విఱుచుచున్నాము. తుట్టతుదకు: గన్నీటిబిందువు చూచినను మనమనస్సు కరగకున్నదే లాక్రిమల్ (Lachrimal) రసము కొంత, సున్నము కొంత, యుప్పు కొంత, ఆక్వా (Aqua) కొంత యని యనేక లక్షల యాణిముత్తెముల విలువ చేయగల యశ్రుబిందువుల ననేకధా భ్రష్టపరిచి భంగపరిచి దానివంక బృష్టము త్రిప్పచున్నాము. ఇంకనుగవిత్వ మని పద్యము లని యేల దేవులాడవలయును. మనపూర్వపరిస్థితులన్నియుఁ బూర్వమున నునృష్లే యున్నవి. కాని మన మనస్సులలో లేనప్పడు, మన గోదావరీనదిలో రసమే కాని మన మనస్సులలో లేనప్పడు, మన కరకకాయయందు భావనయే కాని మన మనస్సులలో లేనప్ప డింకఁ గవిత్వ మెందుకు? మన సూర్య భగవానుఁడు మన కత్యంత సమీపముననే యున్నాఁడు. కాని మన మనస్సులలోఁ గరఁగని మంచుకొండ యున్నపుడు మనకుఁ గవిత్వ మెక్కడిది? కవిత్వము చెప్పనివాని నింక నధిక్షేపించు టెందుకు? ఎట్టిపిచ్చిలో నేవిధమైన వెగటును లేదో, ఎట్టియున్మాదము ప్రపంచోద్దరణ పటిష్టమో, యెట్టిమతిమాలిన తనములో జ్ఞానవిజ్ఞాన ములు దుర్నిరీక్యమైన తేజస్సుచే వెల్గునో, యెట్టి వెర్రికి వేయివిధములు కాక కోటివిధము లయ్యును బరమార్ద గ్రహణవిధాన మనునొక్కటే విధానమున్నదో, యెట్టి వెణ్ణి వెఱ్ఱు లన్నిటికంటె వెఱ్దో యట్టి వెఱ్ఱని, యట్టి లోకాతీతమైన వెఱ్ఱిని, నట్టి వెఱ్లేని వెర్రిని గలిగి తాను ధన్యతఁ జెంది మనల ధన్యులఁ జేయు నాతండు కవి. ఇప్పడైన నట్టిపిచ్చి లక్షకుఁ గోటి కెవ్వనికైన నుండినయెడల వాఁడు కవితాగానము చేయవచ్చును. అంతే గాని కవిత్వమున నేదో ఘనత యున్నదని యాసించి యందుకై ప్రయత్నించి జను లనందర్బగ్రంథముల సృజించి యకాలపు వెర్రులై ప్రకృతి కాపత్తుఁ దెచ్చిపెట్టుట న్యాయమా? అంతేకాక వచనమును వ్రాయువానిని దీసివ్రేఁతసరకుగఁ గుక్కమూతిపిందెగఁ దృణీకరింప న్యాయమా? పద్యమునఁ గవిత్వ ముండి వచనమున లేకుండునా? ఎచ్చట రసముండునో యచ్చటనే కవిత్వమున్నది. కవిత్వము గుణములో నున్నది కాని గణములో