పుట:SaakshiPartIII.djvu/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనుసన్నల మెలఁగును. భాష యాతనిఁ గాంచి గడగడ లాడును.

వచన రచన:-వచన ప్రబంధములు మనలో మొదటినుండియు దక్కువగనేయు న్నవి. వానియందు మనవారికాదరము తక్కువ. చదువవలసిన వారికా, వ్రాయవలసినవారికి? చదువవలసినవారికిఁ జదువునందే యాదరణము లేనప్పడు వచన ప్రబంధములందనాదరణ మనివాపోవుట యెందుకు? వ్రాయ వలసిన వారికే వానియందు వైరాగ్యబుద్ది; వచనమును వ్రాయువాఁడు వట్టి తెలివి తక్కువవాఁడని సాధారణ జనాభిప్రాయమై యున్నది. కవితామణి కోటీరమును ధరించుటకర్హుండు కానివాఁడే యీకట్టెలమోపు మోయ దగినవాఁడని జనుల నమ్మకము. సాధారణజనులకే యటులుండ నిఁకఁ బద్యప్రబంధకర్త వచన ప్రబంధకర్త నెంతచులుకనగాఁ జూచునో చెప్పవలయునా? తాను దేనెపట్టనియు నాతండు చొప్పదంటనియుఁ, దనది పూలయంగడి యనియు నాతనిది పుల్లలదుకాణ మనియుఁ, దననెత్తిపై మకుట మనియు నాతని నెత్తిపై మట్టితట్ట యనియు బద్యలేఖరి వచనలేఖరిని గూర్చి భావించును. ఎంతబుద్దిహీనతయో! ఈబుద్దిహీనత యీనాటిది కాదు. చిరకాలము నుండి వచ్చుచున్నది. నిజముగా నా సేతుహిమాచలపర్యంతము మన యార్యజాతి యంతయుఁ గవిజాతి. భరతదేశమందలి ప్రకృతి సౌభాగ్యమువలన మనము జన్మకవులము. రత్నగర్బ యని సార్ధకనామము ధరించుటకు సర్వదేశములందు మన యార్యావర్తదేశమే సమర్ఘమైనది కాదా? బంగారము పండ దగిన బార్డివతత్త్వము ప్రపంచమున మeజీయొకటి యేది? ఈవైపునఁ బంచోపనదులతోఁ గైలాసముపై నుండి కచ్చివఱకు సింధునది, యదిదాంటి రవంతకుడిప్రక్కకు రాగానే యభవ జటాజూటోద్భవయై యనేకోపనదులతో నమృతాధిక మాధుర్యధురీణాంబు ప్రవాహములతో ననేక శతయోజన పర్యంతావనీస్థలఫలీక రణ పాటవ ప్రాబల్యముతో ననేక జన్మార్జితాఘవినాశన మాహాత్మ్యముతో నార్యావర్తమున కామూలనుండి యీమూలవఆకు జగజ్జనజేగీయమాన ప్రకాశముతోఁ బ్రవహించు నార్యావర్త భాగ్య దేవత యైనగంగాదేవి-మeజీరవంత దాఁటఁగనే ధవళగిరిపైని-నెవరెస్టుపైని-నా సైమన్న శిఖరములపైని నేమూలనో యుద్బవించి వాయువేగముతోఁ బ్రాగ్లిశగాఁ బ్రవహించి అస్పామునొద్ద మోచేతివాటముగా మరలి దక్షిణముగఁ బ్రవహించు బ్రహ్మపుత్ర యిదికాక వీనిక్రింద నర్మద, మహానది, గోదావరి, కృష్ణ తుంగభద్ర, కావేరి మొదలగు మహానదులు తమ శీతలత్వముచేతఁ దమరసరళత్వముచేఁ దమ మాధుర్యముచేఁ దమప్రవాహశక్తిచేఁ దమపవిత్రతచే నార్యావర్తజనసంఘబుద్దితత్త్వమున శీతలత్వము, సారళ్యము, మాధుర్యము, పవిత్రత, ధాటియొసంగుటకుఁ జాలియున్నవని చెప్పటయతిశయోక్తికాదే. ప్రపంచపర్వత ములలోఁ బ్రథమ గణనీయమగు ప్రాలేయాచలము భరతదేశ మాతృదేవతకు హీరకిరీటమై ప్రకాశించుచుండ, వింధ్యాద్రి వజ్రాలమొలనూలై యుండ, సింహళద్వీపము పాదపీఠ మైయుండ, సమస్త ప్రకృతివైచిత్రీ సన్నివేశ ప్రథమనిదానమైన యాభరతఖండమునందు సన్ని హితసూర్యకాంతి జనుల రక్తమునకుఁ దేజోధికత, ధాటి, దీప్తి గలిగింప భావనాప్రపంచమున శంపాలతా కోటులఁ బ్రాంకింపఁ బవనునకు బంగారుపూఁతవోయఁగ సర్వవిధములఁ బ్రకా శించు నార్యావర్తదేశమందుఁ గవులకు, గాయకులకుఁ, జిత్రలేఖకులకు, భక్తులకు, జ్ఞానులకు వేమాత్రమైన లోప మున్నదా! కావున మనది యాజన్మకవిజాతి; మనగ్రంథము లన్నియు వైద్యగ్రంథములే కావు, చరిత్రగ్రంథములే కావు, నిఘంటువులే కా వన్నియుఁ గూడఁ బద్యముననే పూర్వము వ్రాయబడినవి. ఇప్పడు మన కట్టభావనాశక్ తియున్నదా? ఉహు.