పుట:SaakshiPartIII.djvu/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గుదురునొ. ప్రకృతిపరీక్ష యక్కఱలేదు. పాత్రతత్త్వబేద మక్కఱలేదు. ప్రసంగ చమత్కృతి యక్కఱలేదు. పాత్రాచిత్యమక్కఱలేదు. ఏమియు నక్కఱలేదు. పాఠాంతరమునకుఁ బాట దొరికినఁ జాలును. ప్రకృతి ప్రతిబింబములుగ గ్రంథముల వ్రాయవలసిన కవులీ కారణములచే భ్రష్టులై పోకుండ విమర్శగ్రంథములు పుట్టవలసియున్నది. ఒక కవి వేరొక కవిని విమర్శింపఁద గదు. అది ప్రబల వైరమునకుఁ గారణమగును. ఆభయంకర వైరకీలాజాలము పుష్కలావర్తమే ఘమునఁ గాని శాంతింపదు. నిష్పక్షపాతబుద్దితో సాహిత్యపరిషత్తువా రీవిమర్శన కృత్యమును మీద వైచుకొనక తప్పదు. కవిత్వము చెప్పటకు శక్తిలేని వానికవితా రసమును గ్రహింపఁగల లోకోపకారబుద్ది గల నిర్దాక్షిణ్య స్వభావము గలపండితుల నిందుకై పరిషత్తువారు జాగ్రత్త పెట్టవలసి యున్నది. వారి విమర్శనములను బరిషన్మహాసభ్యుల యామోదము నొందినపి మ్మట లోకమున విడువవలయును. పరిషన్ముద్ర వారిపై బడుటచే నవియెచ్చటికిఁ బోయిన సరే నాణెములవలె మారును. అవి తుపాకి పిక్కకుఁ జెదరవు. బల్లెపు బోటునకు జంకవు. వీటివడి కెదురెక్క గలవు. కాని కవుల యనుమతి లేకుండ వారి గ్రంథములను విమర్శింపఁ దగదు. నీగ్రంథముల విమర్శింతుము. నీ వేమందు వని పరిషత్తువారు కవి నడుగునెడల వలదని యాతండన గలఁడా? వలదన్న యెడల నందున నేమి క్రుళ్లున్నదో యని యితరు లనుకొందురేమో యను నందేహ మాతని కుండదా? విమర్శన బహుజాగరూకతతోఁ జేయుట యత్యావశ్యకము. ఎట్టు చేయవలయునో నేను జెప్పను. ఎట్టు చేయగూడదో మాత్రము రవంత చెప్పెదను. స్వల్పదోషమైన నుపేక్షింపఁ దగదు. దోషములను నిర్ణేతుక ముగ నిర్ణయింపఁ గూడదు. చిన్నయ్య కాలమున నట్టు వ్రాసిరి. పెద్దన్న కాలమున నట్లు వ్రాసిరి. నన్నయ్య కాలమున నట్టు వ్రాసిరి. కావున మీరుగూడ నష్లే వ్రాయవలయు నని శాసింపఁదగదు. సర్వ కవులకేకాక సర్వకళాభిజ్ఞలకుఁగూడ నవిలంఘ్యము లగుబహిరంతః ప్రకృతి శాసనములకంటె భిన్నములైన శాసనములు గుణదోషనిర్ణయమున క్కఱకు రాగూడదు. దోషములు నిర్ణయింపవలసినదే కాని యిట్టు దిద్దుపాటు లొందిన యెడల నాదోషములు గుణము లగు నని యెన్నఁడును బలుకవలదు. గ్రంథరచనయం దొకపద్దతిని గాని, మార్గమునుగాని, క్రమమునుగాని చూపదగదు. మీవిమర్శనమువలనఁ గవితకు దళుకుమాత్రమే హెచ్చించి దార్ద్యము తగ్గింపగూడదు. ఆకార సౌందర్యము మాత్రమే వృద్దిపరిచి రసమును దగ్గింప గూడదు. అలంకారములు వృద్ధిపరిచి యవయవసౌందర్య మును నాచ్చాదింపఁ జేయగూడదు. మదగజ యామినీత్వమును మాత్రమే హెచ్చుచేసి మగతనమును దగ్గింపఁదగదు. అనుకరణము మాత్రమే యధికపరిచి యుపజ్ఞ కడ్డు రాగూడదు. చిత్రవిచిత్రము లగురుచులు మాత్రమే వృద్దిపరిచి జీర్ణక్తిని దగ్గింపఁగూడదు. కల్పనకు స్వచ్చందత్వమును తగ్గించి బండిజాడనుబట్టి పోవునట్లు మాత్ర మెన్నఁడును జేయఁదగదు. అట్టే మీ రొనర్చినయెడల మధ్యకాల ప్రబంధశకము దిరుగ నుదయింపఁ జేసినవా రగుదురు. ఇంక మేనమామపోలికలు, కవలపిల్లల పోలికలు, ఇంక ననుకరణములు, ననుకరణమున కనుకరణములు, ఛాయూపటములు, నచ్చుబొమ్మలు మొుదలయినవి బయలుదేరును. విమర్శనములోని కట్టుదిట్టములకు మీ రేన్ని శాసనములు కల్పించినను సామాన్యకవితాశక్తికలవాని కవి ప్రతిబంధము లగునుగాని యుపజ్ఞాసహితుఁడగు నుత్తమకవి ముందెప్పడయిన నుదయించునెడల నాతని నేశాసనములు కూడఁ బ్రతిబంధింపఁజాలవు. నిఘంటువాతని ననుసరించి పోవును. వ్యాకరణ మాతని వెంబడించును. పద్యలక్షణ మాతని